జై శ్రీరామ్ అనిపిస్తానంటున్న షా.. బెదిరింపులకు భయపడనంటున్న దీదీ
12-02-202112-02-2021 07:11:01 IST
Updated On 12-02-2021 10:17:39 ISTUpdated On 12-02-20212021-02-12T01:41:01.922Z12-02-2021 2021-02-12T01:40:56.012Z - 2021-02-12T04:47:39.863Z - 12-02-2021

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తర బెంగాల్ లోని కూచ్ బీహార్ లో అమిత్ షా ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని మోదీ అభివృద్ధి మోడల్ కు, మమతా బెనర్జీ విధ్యంసకర మోడల్ కు మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పారు. జైశ్రీరాం నినాదాలు భారత్ లో కాకపోతే... పాకిస్థాన్ లో చేస్తారా?.. జైశ్రీరాం అనే నినాదాలు చేస్తే మమత ఆగ్రహం వ్యక్తం చేశారని.. ఈ ఎన్నికలు ముగిసేలోగా ఆమె తనకు తానుగా శ్రీరాముడి నినాదాలు చేస్తారని చెప్పారు. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రాకుండా టీఎంసీ గూండాలతో పాటు, మరెవరూ ఆపలేరని అన్నారు. బెంగాల్ లోని ఠాకూర్ నగర్ లో జరగాల్సిన అమిత్ షా కార్యక్రమం రద్దయింది. అమిత్ షా మాట్లాడుతూ, 'అనివార్య కారణాల వల్ల కార్యక్రమం రద్దయింది. మమతా దీదీ చాలా సంతోషంగా ఉంటారు. ఏప్రిల్ వరకు సమయం ఉంది. ఇక్కడకు మళ్లీ మళ్లీ వస్తా. ఎన్నికలలో మీరు ఓడిపోయేంత వరకు వస్తూనే ఉంటా' అని అన్నారు. గత నెలలో కోల్ కతాలో మోదీ పర్యటన సందర్భంగా విక్టోరియా మెమోరియల్ దగ్గర ఏర్పాటు చేసిన సభకు మమతా బెనర్జీ కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఆమె ప్రసంగిస్తుండగా జైశ్రీరాం నినాదాలు కొందరు చేయగా... ఆమె అసహనాన్ని వ్యక్తం చేస్తూ ప్రసంగాన్ని ఆపేశారు. సభకు అంటూ డిగ్నిటీ ఉంటుందని.. దాన్ని మరచి ప్రవర్తించడం తప్పని ఆమె విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ కూడా భారత్ మాతాకీ జై అని ఈ సభలో అనడం తప్పుకాదని.. కానీ జై శ్రీరాం అనాల్సిన సందర్భం ఇది కాదని చెప్పుకొచ్చారు. అమిత్ షా బెదిరింపులకు తాను భయపడబోనని మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్ కు ఆయన ఎప్పుడు వచ్చినా తాము స్వాగతిస్తామని... అయితే ఆయన ఇక్కడకు వచ్చి కించపరుస్తూ మాట్లాడతారని అన్నారు. ఇక్కడకు వచ్చి ప్రచారం చేసుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని... తనను బెదిరించే ప్రయత్నం చేయవద్దని అన్నారు. మిమ్మల్ని చూసి తాను భయపడనని అన్నారు. ఆట ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు. మీరు ఎన్ని గోల్స్ స్కోర్ చేస్తారో నేనూ చూస్తా అని అన్నారు. ఇది బెంగాల్ అని... మీ గూండాగిరి ఇక్కడ పని చేయబోదని చెప్పారు. అమిత్ షా బాడీ లాంగ్వేజ్, మనస్తత్వం, భయపెట్టే తీరు ఆయన పదవికి సరిపోవని అన్నారు.

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
an hour ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
an hour ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
3 hours ago

ఆహా.. ఇది అద్భుతమైన ఓపెనింగ్ ఎంపీ సార్
2 hours ago

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
15 hours ago

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
17 hours ago

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
21 hours ago

అధిష్టానంతో అటో ఇటో తేల్చుకుంటాం.. కాంగ్రెస్ అసమ్మతి నేతలు సిద్ధం
a day ago

జగన్ కి పాలన రాదు అనే మాటకి నిదర్శనాలు ఇవేనా
19 hours ago

టీడీపీకి కర్నూలులో మరో పెద్ద నాయకుడు దూరం..!
a day ago
ఇంకా