శశికళ కారుపై అన్నాడీఎంకే పార్టీ జెండా.. పార్టీ నాదే అని చెబుతారా..?
31-01-202131-01-2021 19:21:11 IST
2021-01-31T13:51:11.566Z31-01-2021 2021-01-31T12:24:52.781Z - - 04-03-2021

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన ఆమె శిక్షా కాలం ముగియడంతో ఇటీవలే విడుదలయ్యారు. దాదాపు 10 రోజుల నుంచి శశికళ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆమెకు ఇప్పుడు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యులు ఇప్పటికే తెలిపారు. 2017లో అక్రమాస్తుల కేసులో అరెస్టయిన శశికళ.. బెంగుళూరు పరప్పన అగ్రహారం జైలుకెళ్లారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో బెంగుళూరులోని ఆసుపత్రికి తరలించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షించగా, పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దాంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. మళ్లీ కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ చేశారు. అక్రమాస్తుల కేసులో ఈ నెల 27తో నాలుగేళ్ల శిక్షాకాలాన్ని ఆమె పూర్తి చేసుకున్నారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె విడుదలవుతుండడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అన్నాడీఎంకే నుండి బహిష్కరించిన శశికళకు బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి వద్ద అనుచరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమెకు భారీ స్వాగతం పలకాలని ఎప్పటి నుండో ప్లాన్ చేసి ఉండగా.. పోలీసులు వాటికి ఒప్పుకోలేదు. ఆమె వెళ్లే సమయంలో శశికళ వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ ఆమె వెళ్లే వాహనంపై ఇలా అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండటం చర్చనీయాంశమైంది. 2016 వరకు అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా పనిచేసిన శశికళను అప్పటి పరిణామాలతో పదవి నుంచి తొలగించడంతో పాటు, పార్టీ నుంచి బహిష్కరించారు. 2021 సంవత్సరంలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు. అన్నాడీఎంకే అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో శశికళ అన్నాడీఎంకే పార్టీ తనదే అని చెప్పే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. శశికళ ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు లేకపోలేదని అంటూ ఉన్నారు.

భారీగా నామినేషన్ల ఉపసంహరణ
43 minutes ago

మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
an hour ago

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
2 hours ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
2 hours ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
4 hours ago

ఆహా.. ఇది అద్భుతమైన ఓపెనింగ్ ఎంపీ సార్
3 hours ago

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
16 hours ago

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
18 hours ago

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
a day ago

అధిష్టానంతో అటో ఇటో తేల్చుకుంటాం.. కాంగ్రెస్ అసమ్మతి నేతలు సిద్ధం
a day ago
ఇంకా