నోరు అదుపులో పెట్టుకో మమత ఆంటీ.. సువేందు అధికారి
01-04-202101-04-2021 18:14:31 IST
2021-04-01T12:44:31.411Z01-04-2021 2021-04-01T12:44:29.079Z - - 16-04-2021

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన నోటిని కాస్త అదుపులో పెట్టుకోవాలని 66 ఏళ్ల వయసులో ఆంటీగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి గురించి అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని మమతా బెనర్జీ బద్ధ శత్రువు సువేందు అధికారి తీవ్రంగా విమర్శించారు. గురువారం నుంచి పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ మొదలైంది. నందిగామ్లో ఎన్నికల ప్రచారం ముగిసిపోయినప్పటికీ మమత, సువేందు మాధ్య మాటల యుద్ధం మాత్రం ఆగుతున్న దాఖలా కనిపించడం లేదు. బీజేపీపై ఇటీవల మమతా విమర్శల నేపథ్యంలో తృణమూల్ నుంచి జంప్ అయి బీజేపీలో చేరిన ఒకనాటి మమత అనుంగు సహచరుడు సువేందు కౌంటర్ ఎటాక్ చేశారు. దీదీ ఈ వయస్సులో నోటిని అదుపులో పెట్టుకోవాలని, భాషను మార్చుకోవాలంటూ హితవు పలికారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు ఓటమి తప్పదని హెచ్చరించారు. మాజీ టీఎంసీ నేత అయిన సువేందు సీఎం మమతా 66 ఏళ్ల ఆంటీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఆమె తన నోటిని అదుపులో పెట్టుకోవాలని, ప్రధాని మోదీపై ఆమె అభ్యంతరకర రీతిలో భాషను వాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మమతా మీడియాతో మాట్లాడారని మండిపడ్డారు. రెండో దశ ఎన్నికల్లో భాగంగా నందిగ్రామ్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్బంగా గురువారం తన ఓటుహక్కును వినియోగించుకున్న సువేందు అధికారి, ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోందని, రీపోలింగ్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని తెలిపారు. బెంగాల్ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారని భావిస్తున్నట్టు సువేందు చెప్పారు. పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే మే 2వ తేదీన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, ఆ తర్వాత కూడా కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉండాలని సువేందు వ్యాఖ్యానించారు. బెంగాల్ భారతదేశంలో భాగమని, పోలింగ్ ఫలితాలు ప్రకటించే మే 2 వ తేదీన కూడా ప్రధాని నరేంద్రమోదీ బెంగాల్లోనే బస చేస్తారని సువేందు పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని మమత ఎన్నికల ప్రచార సమయంలో తీవ్రంగా హెచ్చరించారు. మే 2 తర్వాత కూడా పారామిలిటరీ బలగాలు రాష్ట్రంలో ఉండాలని తన వ్యతిరేకులు కోరుకుంటున్నారని, కానీ తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై తగు చర్య తీసుకుంటానని మమత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సువేందు అధికారి బెంగాల్ సీఎంపై నోరు పారేసుకున్నారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
13 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
9 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
14 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
16 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
18 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
19 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
20 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
21 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
a day ago
ఇంకా