newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

16-01-202116-01-2021 13:20:10 IST
2021-01-16T07:50:10.809Z16-01-2021 2021-01-16T07:50:04.926Z - - 11-04-2021

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బెంగాల్ బీజేపీ అధినేత దిలీప్ ఘోష్ వచ్చే నెలలో 50 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారని చేసిన ప్రకటన పశ్చిమబెంగాల్‌లో కలకలం సృష్టించిన నేపథ్యంలో మమతకు టీఎంసీ మహిళా ఎంపీ, ప్రముఖ నటి ఒకరు షాక్ కలిగించారు. బీర్బూమ్ ఎంపీ శతాబ్ది రాయ్ చేసిన పోస్టు ఒకటి ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌లో కల్లోలం సృష్టిస్తోంది. 

నేను నిర్ణయం తీసుకున్నట్లయితే జనవరి 16 మధ్యాహ్నం 2 గంటలకు మీకు తెలియచెబుతాను అంటూ టీఎంసీ మహిళా ఎంపీ చేసిన పోస్టు బెంగాల్ రాజకీయాలను ఇప్పుడు ఊగించివేస్తోంది. శతాబ్ది రాయ్ 2009 నుంచి బీర్బూమ్ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇది శతాబ్ది రాయ్ స్వయంగా చేసిన పోస్టా లేక ఆమె ఫ్యాన్ క్లబ్ పేజీ అధికారికమైనదేనా అనేది స్పష్టం కావడం లేదు.

డిసెంబర్ 29న మమతా బెనర్జీతో కలసి బోల్‌పూర్‌లో శతాబ్ది రాయ్ టీఎంసీ కార్యకర్తల ప్రదర్శనలో నడుస్తూ కనిపించారు. అయితే శుక్రవారం సాంయంత్రం 5 గంటల సమయంలో ఈ సంచలన వ్యాఖ్య పోస్ట్ చేశాక, రాయ్ ఫోన్ పనిచేయడం లేదు. శతాబ్ది రాయ్ ఫ్యాన్ క్లబ్ ఫేస్‌బుక్‌లో తన నియోజక వర్గ ప్రజలనుద్దేశించి పంపిన సందేశంలో రాయ్ కార్యకర్తలతో, అభిమానులతో కలిసి ఉండలేకపోయినందుకు మానసికంగా వ్యధ చెందుతున్నానని పేర్కొన్నారు. పార్టీకి చెందిన అనేక కార్యక్రమాల్లో తనను ఎవరూ ఆహ్వానించలేదని శతాబ్ది రాయ్ పేర్కొంటూ బాధను వ్యక్తం చేశారు.

నేను మీతోపాటు కలిసి నడవడం కొంతమందికి ఇష్టం లేదేమోనని భావిస్తున్నాను. పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలు గురించి నాకు తెలియపర్చలేదు. నేను ఎలా ముందుకెళ్లాలి. ఇది నాకు మనోవ్యధను కలిగిస్తోంది అని రాయ్ తన సందేశంలో పేర్కొన్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా మీతో పూర్తి స్థాయిలో కలిసి ఉండేలా తగు నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. మీకందరికీ నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. 2009 నుంచి మీరు నాకు మద్దతు తెలుపుతూ నన్ను లోక్ సభకు పంపుతూ వస్తున్నారు. భవిష్యత్తులో కూడా నా పట్ల మీ అభిమానం కొనసాగుతుందని ఆశిస్తున్నాను. పార్లమెంటు సభ్యురాలిని కాక ముందు నుంచీ కూడా బెంగాల్ ప్రజలు నన్ను ఎంతగానో ప్రేమించారు. నేను కొనసాగడానికి, నా విధి నేను చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ నేను నిర్ణయం తీసుకున్నట్లయితే జనవరి 16 మధ్యాహ్నం 2 గంటలకు మీకు తెలియపరుస్తాను అని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.

టీఎంసీ తోటి ఎంపీ సౌగత్ రాయ్ మహిళా ఎంపీ చేసిన వ్యాఖ్యలపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె ఏ నిర్ణయం తీసుకోనున్నారో చూడటానికి శనివారం వరకు వేచి చూస్తానని సౌగత్ రాయ్ చెప్పారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఈ విషయమై ఎలాంటి వ్యాఖ్యానాలు రావడం లేదు.

టీఎంసీ నేత, మంత్రి రజిబ్ బెనర్జీ కూడా ఇదేవిధమైన ప్రకటన చేయడం కాకతాళీయమే కావచ్చు. గత నెలలో పార్టీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రజిబ్ కూడా తన సోషల్ మీడియా పేజీలో జనవరి 16 అంటే శనివారం సాయంత్రం 3 గంటలకు తన ఫేస్ బుక్ లైవ్‌లో ప్రసంగిస్తానని ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. శతాబ్ది రాయ్‌ని బీర్బూమ్ జిల్లా నాయకత్వం కొంతకాలంగా పక్కన బెడుతున్నారని, అందుకే ఆమె మనోవ్యధకు గురై ఉంటారని జిల్లా పార్టీ వర్గాలు తెలిపాయి.

డిసెంబర్ 19న ఏడుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మల్యేలు, ఒక ఎంపీ పార్టీనుంచి వైదొలిగి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిపోవడం తెలిసిందే. వారి విద్రోహాన్ని టీఎంసీ తోసిపుచ్చింది.

2021 మే నెలలో ఆరునుంచి ఏడుగురు బీజేపీ ఎంపీలు స్థానాలు మార్చుకోవచ్చంటూ పశ్చిమబెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మాలిక్  చేసిన ప్రకటనకు బీజేపీ రాష్ట్ర అధిపతి ఎదురు సమాధానం చెబుతూ 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం బెంగాల్ రాజకీయాల్లో ముసలం పుట్టిస్తోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle