newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మమత హ్యాట్రిక్.. అస్సాంలో రెండోసారి బీజేపీ.. వామపక్షాలదే కేరళ.. తమిళనాట డీఎంకే

02-05-202102-05-2021 21:21:49 IST
Updated On 03-05-2021 07:17:22 ISTUpdated On 03-05-20212021-05-02T15:51:49.226Z02-05-2021 2021-05-02T15:51:45.472Z - 2021-05-03T01:47:22.736Z - 03-05-2021

మమత హ్యాట్రిక్.. అస్సాంలో రెండోసారి బీజేపీ.. వామపక్షాలదే కేరళ.. తమిళనాట డీఎంకే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇటు ఉత్కంఠను, అటు నిరాశను రేకెత్తిం చేవిగానే వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముచ్చటగా మూడవ సారి పగ్గాలు చేపట్టబోతున్నారు. రెండు వందలకు పైగా సీట్లను సాధించిన మమతా బెనర్జీ రాష్ట్రంలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. ఎలాగైనా బెంగాల్ లో గెలవాలని అహరహం శ్రమించిన బీజేపీ కలలు ఫలించలేదు. మమత పోటీ చేసిన నందిగ్రామ్ ఫలితం విషయంలో కొంత సందిగ్థత వ్యక్తమైనప్పటికీ అంతిమంగా దీదీయే పైచేయి సాధించారు. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ విజయాన్ని మమతా బెనర్జీ అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్  నిబంధనలను పాటించి  ఈ ఎన్నికల్లో పాల్గొన్నారని,

నందిగ్రామ్ నియోజవర్గంలో 1200 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన మమత అన్నారు. చక్రాల కుర్చీకి స్వస్తిచెప్పిన ఆమె ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్తున్నాని ఆమె అన్నారు. రాష్ట్రాల్లో అనేక చోట్ల తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీ గట్టి పోటీయే ఇచ్చింది. కేరళలో పినరయి విజయం సారధ్యంలోని ఎల్డిఎఫ్ మరో సారి చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మరీ విజయం విజయ విహారం చేశారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు మరోసారి చుక్కెదురైంది. పేలవమైన ఫలితమే దక్కింది.

అస్సాంలో రెండవసారి కూడా బీజేపీ తన హవా చాటుకుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ రెండవసారి అధికార పీఠం అధిష్టించేందుకు సమాయాత్తం అవుతోంది. 126 సీట్లు కలిగిన అసెంబ్లీలో తుది ఫలితాలు వెలువడే సమయానికి సగానికి పైగా సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది.

అందరూ ఊహించినట్టుగానే తమిళనాట డీఎంకే శకం మొదలైంది. ప్రతిపక్ష డీఎంకే భారీ మెజారిటీతో అధికార పీఠాన్ని హస్తగతం చేసుకోబోతోంది. మెజారిటీ సీట్లలో లీడింగ్ లో ఉన్న తమ పార్టీ సరికొత్త శకాన్ని ఆరంభించబోతోందని డీఎంకే అధ్యక్షుడు ఎం. కె. స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రంలో ఏర్పడబోయేది తమ ప్రభుత్వమేనని ఆయన ప్రకటించారు. 234 అసెంబ్లీ సీట్లలో ఆదివారం పొద్దుపోయే సమయానికి  డీఎంకే మెజారిటీ దిశగా దూసుకు వెళ్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్ల స్వల్ప మెజారిటీ అవసరం. ఈ అసెంబ్లీ విజయం సాధించిన మమత, విజయం, స్టాలిన్ లకు కేంద్ర మంత్రి  రాజనాధ్ అభినందనలు తెలిపారు.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle