newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

13-05-202113-05-2021 09:12:21 IST
2021-05-13T03:42:21.804Z13-05-2021 2021-05-13T01:55:02.240Z - - 14-06-2021

నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సలహాలు వినకపోవడం వల్లే కోవిడ్  విషాదం..  

దేశంలో కరోనా వైరస్ సృష్టిస్తున్న భయానక మానవ విషాదానికి ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడమే కారణమని 12 ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. ఉపాధి లేని వారికి నెలకు ఆరు  వేల రూపాయలు ఇవ్వాలని, కేంద్ర గిడ్డంగుల్లో లక్ష టన్నుల ఆహార ధాన్యాలు ముక్కిపోతున్నందున వాటిని అవసరంలో ఉన్న వారికి పంచాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా 12 ప్రతిపక్ష పార్టీల నేతలు లేఖ రాశారు.   

ఈ సందర్బంగా తొమ్మిది అంశాలను ప్రస్తావించిన విపక్ష నేతలు వాటిపై మోడీ వెంటనే దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును వెంటనే నిలిపి వేసి ఆ మొత్తాన్ని ఆక్సిజన్, వ్యాక్సిన్లు కొనడానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా వైరస్ కట్టడికి కేంద్రానికి ఎన్నో సూచనలు చేశామని కానీ ప్రభుత్వం వాటిని విస్మరించడం వల్లే కరోనా వైరస్ ఓ భయానక మానవ విషాదంగా మారిందని పేర్కొన్నారు. అప్పుడే ప్రభుత్వం స్పంచించి ఉంటే ఇంత భయానక పరిస్థితి తలెత్తి ఉండేది కాదని ప్రతిపక్ష నేతలు తమ లేఖలో పేర్కొన్నారు. 

ఉచిత వ్యాక్సిన్ సహా తాము ప్రతిపాదించిన తొమ్మిది డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి అమలు చేయడం అత్యవసరమని విపక్ష నేతలు పేర్కొన్నారు. అత్యవసర వైద్య పరికరాలను వ్యాక్సిన్ ను కొనేందుకు పీఎం కేర్స్ నిధులను తక్షణమే విడుదల చేయాలనీ విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ లేఖలో వివాదాస్పద వ్యవసాయ చట్టాల అంశాన్ని కూడా ప్రస్తావించారు. లక్షలాది మంది అన్నదాతల ప్రయోజనాలను పరిరశించాలంటే ఈ మూడు చట్టాలను రద్దు చేయాలని, 12 పార్టీల నేతలు ప్రధానికి స్పష్టం చేశారు.

రైతులు కరోనా బారిన పడకుండా వారికి రక్షణ కల్పించాలని, అప్పుడే దేశానికి అన్నం పెట్టగలుగుతారని విపక్ష నేతలు తెలిపారు. ఈ డిమాండ్లన్నీ కూడా తాము గత కొంతకాలంగా చేస్తున్నవేనని, వాటిని కేంద్రం పట్టించుకోకపోవడం వల్లే మళ్ళీ ప్రధాని దృష్టికి తీసుకు రావలసి వచ్చిందని తెలిపారు. మాజీ ప్రధాని దేవీ గౌడ, మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ లేఖపై సంతకం చేశారు. జాతీయ స్థాయిలోనే అన్ని మార్గాల ద్వారా వ్యాక్సిన్లను సేకరించి దేశంలో అందరికీ వాటిని ఉచితంగా పంపిణీ చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. అలాగే దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలంటే లైసెన్సును తప్పనిసరి చేయాలని, ఇందుకోసం బడ్జెట్ లో కేటాయించిన 35 వేల కోట్లు ఖర్చుచేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle