newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

వైసీపీ అభ్యర్థిని ప్రకటించేశారే

21-11-202021-11-2020 08:32:12 IST
2020-11-21T03:02:12.793Z21-11-2020 2020-11-21T03:02:09.388Z - - 06-12-2020

వైసీపీ అభ్యర్థిని ప్రకటించేశారే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీలో తిరుపతి వేదికగా పొలిటికల్ హీట్ మొదలైంది. ఈ ఎన్నికలను అధికార వైసీపీ ప్రభుత్వం, ప్రతి పక్షంలో ఉన్న టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి నెలకొంది. తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరుగనుంది. తమ అభ్యర్థి విషయంలో కసరత్తు చేసిన వైసీపీ డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించింది.  తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని ఎన్నికల బరిలోకి దింపింది. 

గత ఎన్నికల్లో ఓడిపోయిన పనబాక లక్ష్మికి మళ్లీ రెండో అవకాశం ఇచ్చిన టీడీపీ.. తిరుపతి ఎంపీ స్థానంలో నిర్ణయాత్మక విజయం కోసం పావులు కదుపుతోంది. దీంట్లో బాగంగానే జగన్మోహన్ రెడ్డి పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలని, తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ అరాచకాలకు గుణపాఠం చెప్పే వేదిక తిరుపతి ఉప ఎన్నిక కావాలని టీడీపీ అధినేత పిలుపునిచ్చారు. ఇటీవలే చిత్తూరు జిల్లా నేతలతో జూమ్‌ యాప్‌ ద్వారా కాన్ఫరెన్సు నిర్వహించిన ఆయన.. తిరుపతి ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ చేస్తారని ప్రకటించారు.  బలమైన మహిళా అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ప్రత్యర్థులకు సవాల్‌ విసిరారు. ఎన్నికల నిర్వహణకు కమిటీని కూడా నియమించారు. తిరుపతి ఉప ఎన్నికలతోనే వైసీపీ పతనానికి నాంది పలకాలంటూ కార్యకర్తలకు పిలుపివ్వడం ద్వారా ప్రత్యర్థి పార్టీకి చంద్రబాబు తొలి హెచ్చరిక జారీ చేశారు. దీంతో టీడీపీలో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం నెలకొంది. అనివార్యంగా మిగిలిన పార్టీలూ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఎక్కడైనా ఉప ఎన్నిక జరిగితే అధికార పార్టీ తనకున్న అనుకూల పరిస్థితుల దృష్ట్యా ముందస్తుగా రంగంలోకి దిగడం ఆనవాయితీ. అదే సమయంలో ప్రతిపక్షం ఎంతోకొంత నిరాసక్తంగానే తప్పదంటూ సన్నద్ధం కావడం తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నికలో ఈ ఆనవాయితీని టీడీపీ అధినేత తిరగరాశారు. అభ్యర్థిని ప్రకటించడం ద్వారా తొలి అడుగు తనే ముందుకేశారు.

 

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

   5 hours ago


నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

   6 hours ago


కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

   6 hours ago


కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

   7 hours ago


ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

   8 hours ago


టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

   9 hours ago


సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

   9 hours ago


 ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

   10 hours ago


సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

   10 hours ago


వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

   10 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle