newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

భారీ వర్షాలు, సహాయక చర్యలపై వైఎస్ జగన్ సమీక్ష

14-10-202014-10-2020 17:15:43 IST
2020-10-14T11:45:43.586Z14-10-2020 2020-10-14T11:45:36.677Z - - 21-10-2020

భారీ వర్షాలు, సహాయక చర్యలపై వైఎస్ జగన్ సమీక్ష
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తుతుండడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  బుధవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, సహాయక చర్యలపై ఈ సమీక్ష నిర్వహించగా..  మంత్రులు సుచరిత, బొత్స, సీఎస్‌ నీలంసాహ్ని పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, అధికారులతో జిల్లాలవారీగా సీఎం సమీక్షించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని.. విద్యుత్‌ పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టి వరద బాధితులకు సాయం చేయాలని అన్నారు. వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలని.. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అవసరమైన సాయం అందించాలని అన్నారు. 

భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వర్షాల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారని... వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. దెబ్బతిన్న పంటలకు కూడా నష్ట పరిహారం చెల్లించాలని.. వర్షం వల్ల దెబ్బతిని, రంగు మారిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ప్రకటించి, ప్రభుత్వమే కొనాలని అన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని.. ప్రత్యామ్నాయ సాగుకు విత్తనాలు, ఎరువులను ఉచితంగా అందించాలని కోరారు.  దెబ్బతిన్న పడవలు, వలలు మరమ్మతులకు ఆర్థిక సాయం అందించాలని, కూలిపోయిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను మంజూరు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle