newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!

11-04-202111-04-2021 18:50:43 IST
2021-04-11T13:20:43.668Z11-04-2021 2021-04-11T13:20:31.317Z - - 27-07-2021

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలో సభను రద్దు చేసుకున్నారు.  తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకోవడంతో తిరుపతి పార్లమెంట్‌ ఓటర్లకు జగన్‌ బహిరంగ లేఖ రాశారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున రాలేకపోతున్నానని, 24 గంటల్లో కరోనాతో మరణించిన 11 మందిలో.. నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాళ్లు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని.. నెల్లూరు జిల్లాలో కూడా ఒక్కరోజులోనే 292 కేసులు వచ్చాయన్నారు. కరోనా బులెటిన్‌ చూశాక.. తిరుపతి నియోజకవర్గ ప్రజలకు లేఖ రాస్తున్నా అన్నారు. మీరంతా నా వాళ్లే.. నేను సభకు హాజరైతే వేలాది మంది వస్తారు. మళ్లీ కోవిడ్‌ కేసులు పెరిగే ప్రమాదం ఉందని లేఖలో రాశారు. తిరుపతి పార్లమెంట్‌ బై పోల్‌ లో మనందరి అభ్యర్థిగా పోటీ చేస్తోన్న గురుమూర్తికి ఓటు వేయాల్సిందిగా నేను రాసిన ఉత్తరం మీ ఇంటికి అందిందని భావిస్తున్నాను.. అంటూ తన పర్యటన రద్దు కావడానికి గల కారణాలను కూడా జగన్‌ తన లేఖలో తిరుపతి ఓటర్లకు వివరించారు.

ఈనెల 8వ తేదీ గురువారం తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల ఇంటింటికీ సీఎం జగన్ లేఖలు పంపారు. ఎంపీ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి ఈ లేఖలు పంపారు. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా జరిగిన లబ్ధిని లేఖలో వివరించారు. రాష్ట్రాభివృద్ధి, వాగ్దానాల అమలు, ప్రభుత్వ దార్శనికతను సీఎం ఆ లేఖలో ప్రస్తావించారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దుపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. నిన్నమొన్నటి వరకు కరోనా లేదు, గిరోనా లేదు ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన జగన్.. నేడు అదే కరోనా పేరు చెప్పి తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని, ఇది పిరికితనం కాక మరేంటని విమర్శించారు. జగన్ విచిత్రమైన వ్యక్తి అని, ఆయన రివర్స్‌లో పనిచేస్తారని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎక్కడ ప్రమాణం చేయాల్సి వస్తుందోనన్న భయంతోనే జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని.. ఆయన హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో ప్రమాణం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అచ్చెన్నాయుడు అన్నారు.

టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య కూడా జగన్ సభను రద్దు చేసుకోవడంతో విమ‌ర్శ‌లు గుప్పించారు. 'మీ తిరుపతి ఎన్నిక‌ల‌ సభ ఎందుకు వాయిదా వేశారు ముఖ్యమంత్రి గారూ, కరోనా భయంతోనేనా? మరి మిగతా నాయకుల సభలకు జనం తండోప తండాలుగా వస్తున్నారు. అదే నిజమైతే, ఎన్నికలు వాయిదా వెయ్యాలిగా? అసలు మీ భయం, కరోనా గురించా, లేక "బాబాయిని చంపిందెవరని" జనం నిలదీస్తారనా? తెగేదాక‌ లాక్కండి సార్, పబ్లిక్ సార్' అని వ‌ర్ల రామ‌య్య విమ‌ర్శ‌లు చేశారు. 


Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle