newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

02-12-202002-12-2020 18:33:33 IST
Updated On 03-12-2020 07:50:02 ISTUpdated On 03-12-20202020-12-02T13:03:33.430Z02-12-2020 2020-12-02T12:59:37.051Z - 2020-12-03T02:20:02.438Z - 03-12-2020

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పేదలకు ఉచిత ఇళ్ల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియని పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడు ఇళ్ల విషయంలో కోర్టులకు వెళ్లడం వలనే పేదలకు ఇంకా అందించలేకపోతున్నామని చెబుతోంది. అసెంబ్లీలో ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం ఓ సరికొత్త లాజిక్ చెప్పింది. అయితే ఆ లాజిక్ విన్న టీడీపీ నాయకులతో పాటూ.. టీవీలు చూస్తున్న ప్రజలు కూడా షాక్ అయ్యారు. 

టిడ్కో ఇళ్లన్నింటినీ లబ్దిదారులకు ఉచితంగా ఇస్తామన్నారు కదా అని విపక్ష నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఉచితంగా ఇళ్లు ఇస్తానని చెప్పలేదని.. మేనిఫెస్టోను ప్రదర్శించారు. 300 చదరపు అడుగుల ఇళ్ల గురించి మాత్రమే ఉందని వివరించారు. మిగతా ఇళ్లకు డబ్బులు వసూలు చేస్తానని లేదని.. 300చదరపు అడుగుల ఇళ్లను మాత్రమే ఉచితంగా ఇస్తానని అంతకన్నా పది చదరపు అడుగులు ఎక్కువైనా డబ్బులు కట్టాల్సిందేనని ఆయన వాదన వినిపించారు. జగన్ చెప్పిన లాజిక్ కు టీడీపీ సభ్యులు షాక్ అయ్యారు. 300 చదరపుఅడుగుల్లో ఇల్లు అంటే… ఒక్క రూమ్ .. చిన్న వరండా కూడా రావడం కష్టమేనని.. ఈ విషయంలో జగన్ తీరు మారాలని చాలా మంది విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. 

ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మేం అడ్డుపడుతున్నట్టు ఆరోపణలు చేస్తున్నారు.. ఇళ్ల స్థలాలుగా శ్మశానాలు, ఆవ భూములు, మడ భూములు ఇస్తారా? అని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రశ్నించారు. ఎవరికో కడుపు మండి కోర్టుకు వెళితే మాపై విమర్శలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల్లో అవినీతిపై విచారణ జరిపించండని డిమాండ్ చేశారు చేశారు చంద్రబాబు. టీడీపీ హయాంలో గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్లు ఇచ్చామని అన్నారు. 

వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు సెంట్ భూమి ఇచ్చి మురికివాడలు తయారా చేస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే కట్టిన ఇళ్లకు బిల్లులు ఇవ్వని పరిస్థితి ఉందని, లబ్ధిదారులకు ఇళ్లను ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. తాము కట్టిన ఇళ్లకు మీ స్టిక్కర్ వేసుకోవడం ఏమిటని మండిపడ్డారు. ఇలాగే చేస్తూ పోతే చివరకు స్టిక్కర్ సీఎంగా మిగిలిపోతావని అన్నారు.  ఇళ్లను ఉచితంగా ఇస్తానని జగన్ చెప్పారని అన్నారు. మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేయవద్దని చెప్పారు. పాదయాత్రలో ఒకటి చెప్పి, మేనిఫెస్టోలో మరొకటి పెడితే ఎలాగని ప్రశ్నించారు. రూపాయికే ఇల్లు ఇస్తామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటోందని అన్నారు.

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

   an hour ago


కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

   an hour ago


మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

   6 hours ago


వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

   7 hours ago


అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

   9 hours ago


మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

   9 hours ago


దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

   10 hours ago


ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

   11 hours ago


క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

   11 hours ago


ఓటర్ల జాబితా విడుదల.. నిమ్మగడ్డకు ఎంటీ ధైర్యం?

ఓటర్ల జాబితా విడుదల.. నిమ్మగడ్డకు ఎంటీ ధైర్యం?

   12 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle