ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల
19-01-202119-01-2021 21:15:27 IST
Updated On 20-01-2021 10:23:54 ISTUpdated On 20-01-20212021-01-19T15:45:27.183Z19-01-2021 2021-01-19T15:45:22.639Z - 2021-01-20T04:53:54.399Z - 20-01-2021

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రాభివృద్ధికి చెందిన అంశాలపై అమిత్ షాతో చర్చించనున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. సీఎం ఢిల్లీ పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు నిధులు తదితర అంశాల గురించి అమిత్ షాను కలవనున్నారని వెల్లడించారు. హైకోర్టు విభజన అంశాన్ని కూడా సీఎం జగన్ చర్చించే అవకాశం ఉందని తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో కిలారి రాజేశ్ కేసు ఓ చిన్న విషయం మాత్రమేనని, ఇందులో ఉన్న పెద్ద తలకాయలు త్వరలోనే బయటకొస్తాయని సజ్జల చెప్పుకొచ్చారు. రాజధాని భూముల్లో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణ కొనసాగుతుందని, త్వరలో నిజాలు నిగ్గు తేలుతాయని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. తాము బలహీనులము కాదని, తమ బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకోవడం లేదని ఆయన అన్నారు. రాజకీయ పార్టీగా తమకంటూ ప్రత్యేక విధి విధానాలు ఉన్నాయని అన్నారు. కొడాలి నాని, దేవినేని ఉమ ఎపిసోడ్లో పూర్తి బాధ్యత టీడీపీదేనని పునరుద్ఘాటించారు. టీడీపీ నేతలు పదే పదే ఒకే అబద్దాన్ని చెప్పి దానిని నిజం చేయాలని చూస్తున్నారని, వారి తాటాకు చప్పుళ్లకు తామేమాత్రం వెరవమని హెచ్చరించారు. దేవాలయాలపై దాడుల వెనుక ఎవరి హస్తం ఉందో, రాష్ట్ర ప్రజలకు ఇదివరకే స్పష్టత వచ్చిందని చెప్పుకొచ్చారు. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ పమిడిముక్కల పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. తాను ఎప్పుడైనా సరే గొల్లపూడికి వస్తానని, ప్రజలకు చంద్రబాబు ఏం చేశారో, సీఎం జగన్ ఏం చేశారో చెబుతానని గొల్లపూడిలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ మంత్రి కొడాలి నాని పాల్గొని వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమ ఇంట్లో అయినా సరే తాను చర్చకు రెడీ అని సవాల్ విసిరారు. దీంతో చర్చకు రావాలంటూ ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు ఈ రోజు దేవినేని ఉమ వెళ్లారు. దీంతో దేవినేని ఉమకు అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈరోజు హైడ్రామా నడిచింది.

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
3 hours ago

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భార్య ఒత్తిడే కారణమా
2 hours ago

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ సర్కార్ కు ముందే తెలుసు
4 hours ago

వివాదంలో అశోక్‌గజపతిరాజు.. మహిళను కొట్టారా..?
12 minutes ago

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
19 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
21 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
a day ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
a day ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
a day ago

దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
12 hours ago
ఇంకా