ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!
19-01-202119-01-2021 18:46:47 IST
2021-01-19T13:16:47.451Z19-01-2021 2021-01-19T13:16:36.101Z - - 09-03-2021

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. సీఎం బృందంలో వీరిద్దరే కాకుండా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, అడిషనల్ ఏజీ జాస్తి నాగభూషణ్ కూడా ఉన్నారు. ఢిల్లీలో సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఏపీలో ఇటీవలి పరిణామాలతో పాటు పలు అంశాలపై అమిత్ షాతో ఆయన చర్చించనున్నారు. ఆలయాలపై దాడుల ఘటనలపై ఆయనకు వివరిస్తారని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ రూపొందుతున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి పెండింగ్ నిధుల విడుదల, ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశాలున్నాయి.
అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. పోలవరం పెండింగ్ నిధులు, హైకోర్టు తరలింపు తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో జగన్ చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో దేవాలయాల విధ్వంసాలు, అంతర్వేదిలో రథం దగ్ధం కేసుపై నాలుగు నెలలుగా సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడం, గుళ్లపై దాడుల విషయమై విమర్శలు వస్తున్న సమయంలో ఈ పర్యటన రాజకీయ ప్రాధాన్యతని సంతరించుకొంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలను అమిత్‌షాకు జగన్ వివరిస్తారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించాలని సీఎం జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీడీపీ టార్గెట్ చేసింది. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా సీఎంకు కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ఈ రోజు మీ ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి లాభం తెస్తుందా?.. రావాల్సిన నిధులు,ప్రత్యేక హోదా పై మీరు పోరాడాలి. మీరు వెళ్తున్నారా.. లేక బీజేపీ, కేంద్ర పెద్దలు మీ మత రాజకీయాలు గురించి పిలిపిస్తున్నారా..?’ అంటూ ట్వీట్ చేశారు. జగన్ ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ కు ఏమేమి తీసుకుని వస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
3 hours ago

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భార్య ఒత్తిడే కారణమా
3 hours ago

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ సర్కార్ కు ముందే తెలుసు
5 hours ago

వివాదంలో అశోక్‌గజపతిరాజు.. మహిళను కొట్టారా..?
43 minutes ago

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
20 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
a day ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
a day ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
a day ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
a day ago

దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
12 hours ago
ఇంకా