వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు, మూడు అసెంబ్లీ సీట్లు రావంటున్న ఏపీ సియం
01-12-202001-12-2020 12:45:54 IST
Updated On 01-12-2020 12:54:19 ISTUpdated On 01-12-20202020-12-01T07:15:54.809Z01-12-2020 2020-12-01T07:15:49.591Z - 2020-12-01T07:24:19.248Z - 01-12-2020

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మొదటి రోజు ఏకంగా పోడియం ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోడియం ముందు కూర్చునేశారు. ఈ రోజు కూడా టీడీపీ అధికార పక్షానికి అడ్డు పడుతూనే ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తన పద్ధతిని మార్చుకోకుంటే, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి రెండు, మూడు అసెంబ్లీ సీట్లు కూడా దక్కబోవని అన్నారు. సభకు పదేపదే అంతరాయం కలిగించడం ఆ పార్టీ నాయకులకు పరిపాటిగా మారిందని, కనీస చర్చల్లోనూ పాల్గొనకుండా ఉండాలన్న ఉద్దేశంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు అసలు సభకు ఎందుకు వస్తున్నారో కూడా తెలియడం లేదని అన్నారు. అనవసరమైన అంశాలపై వారు చేస్తున్న రాద్ధాంతాన్ని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు తన క్రెడిబులిటీని కోల్పోవడంతోనే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారని, ఇదే పద్ధతిని కొనసాగిస్తే, ఆ స్థానం కూడా మిగలదని అన్నారు. టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలకు పదేపదే ఆటంకాలు కల్పిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. పదే పదే వాగ్వాదానికి దిగుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!
an hour ago

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం
2 hours ago

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?
2 hours ago

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
7 hours ago

వరస్ట్ సీఎంలలో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే
8 hours ago

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా
10 hours ago

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?
10 hours ago

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్
11 hours ago

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?
12 hours ago

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?
12 hours ago
ఇంకా