తాడేపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో వైఎస్ జగన్
14-01-202214-01-2022 21:32:53 IST
Updated On 14-01-2022 21:32:43 ISTUpdated On 14-01-20222022-01-14T16:02:53.778Z14-01-2022 2022-01-14T16:01:38.955Z - 2022-01-14T16:02:43.606Z - 14-01-2022

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి భారతి సంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాగా, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా వేడుకలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా చిన్నారులతో కాసేపు ముచ్చటించిన సీఎం జగన్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రతి ఇంటా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు, మన గ్రామాలకు, వ్యవసాయానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా నిలిచే పండుగ సంక్రాంతి అని అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆనందాన్ని పంచాలని ఆకాంక్షిస్తూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భోగి పండుగను ప్రజలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు భోగి మంటలు వేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమ ఇళ్ల వద్ద ప్రజలతో సంబరాల్లో మునిగిపోయారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా