నివార్ తుఫాన్ బాధిత రైతుల నోట మట్టిగొట్టిన ప్రభుత్వం?!
01-12-202001-12-2020 14:25:00 IST
Updated On 01-12-2020 14:31:20 ISTUpdated On 01-12-20202020-12-01T08:55:00.456Z01-12-2020 2020-12-01T08:54:57.160Z - 2020-12-01T09:01:20.988Z - 01-12-2020

తమ ప్రభుత్వం రైతులకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని వైసీపీ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ పార్టీ చర్యలు మాత్రం వేరేలా ఉన్నాయని విమర్శలు గుప్పించారు ఇతర పార్టీల నేతలు. నివార్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఎటువంటి పరిహారం చెల్లించడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ముందుకు రాకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నివార్ తుఫాన్ బాధిత రైతుల నోట మట్టిగొట్టిన ప్రభుత్వంగా మారిందని పలువురు నేతలు విమర్శలకు దిగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు కానీ.. పరిహారానికి సంబంధించిన ఎటువంటి ప్రకటన కూడా లేదు. ఎకరానికి పంటను బట్టి పదిహేను నుంచి పాతిక వేల వరకూ సాయం ప్రకటిస్తారన్న చర్చ జరిగింది. వరదల్లో మునిగిపోయిన వారికి కూడా ఇంటికి పదివేల వరకూ సాయం ఇస్తారని కథనాలు వచ్చాయి.. అయినా కూడా ఎటువంటి ప్రకటన రాకపోవడంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నియోజకవర్గాల్లో రైతులనుంచి సాయం కోసం పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది.. ఎంత మేర రైతులు నష్టపోయారో కూడా చెప్పలేదు. డిసెంబర్ 31లోగా పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇస్తామని ప్రకటించారు. నష్టపరిహారం అంటే.. ఇన్పుట్ సబ్సిడీ. ప్రత్యేకంగా పంటలకు పరిహారం ప్రకటించలేదు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని.. నష్టపోయిన రైతులకు 80 శాతంపై సబ్సిడీ విత్తనాలు ఇస్తామని ప్రకటించారు. తుపానుతో నష్టపోయిన మత్స్యకారులను ఆదుకుంటామన్నారు. దీంతో నివార్ తుఫాన్ బాధిత రైతుల నోట మట్టిగొట్టిన ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం మారనుందని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇది చదవండి: జగన్ అభయం యాప్ వెనుక అవాక్కయ్యే నిజాలు..

పంచాయితీ కోసం టీడీపీ పంచసూత్రాలు
an hour ago

రామ తీర్థానికి కొత్త కళ
an hour ago

బరిలోకి దిగిన జనసేన.. పవన్ వర్సెస్ జగన్ ఫైట్
an hour ago

ఏకగ్రీవాల్లోనూ.. ఎవరి దారి వారిదేనా..
2 hours ago

పాస్ పోర్ట్ కేసుకు కేసీఆరే అసలైన గురువు.. అసలు ఈ కేసేంటి?
6 minutes ago

కర్నాటకలోని మరాఠీ ప్రాంతాలు మావే.. ఉద్ధవ్ వ్యాఖ్యతో వివాదం
5 hours ago

జాతీయ జెండాను అవమానిస్తే సహించం.. కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణ
7 hours ago

ఏకగ్రీవాలపై పేపర్ ప్రకటన.. ఎవరిని అడిగి ఇచ్చారని సంజాయషి ఇవ్వాల్సిందే..
8 hours ago

రైతుల ఉద్యమంలో విధ్వంసకారులు.. 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
8 hours ago

వైసీపీలో గ్రూపుల కొట్లాట.. ఏకగ్రీవం కోసం ఫైటింగ్ లు
6 hours ago
ఇంకా