newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

12-05-202112-05-2021 18:41:27 IST
Updated On 13-05-2021 07:35:45 ISTUpdated On 13-05-20212021-05-12T13:11:27.260Z12-05-2021 2021-05-12T13:11:22.317Z - 2021-05-13T02:05:45.559Z - 13-05-2021

విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి: రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నామని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగానే విస్తృత స్థాయిలో నాడు నేడు కార్యక్రమాన్ని అమలుచేస్తున్నామని పేర్కొన్న అయన విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలను పెంచాలని అధికకారు లను ఆదేశించారు. ఆ విధంగా వాటి కార్యకలాపాలను రూపొందించాలని బుధవారం తన క్యాంప్ ఆఫీసులో ఉన్నత విద్యపై జరిగిన సమీక్ష సందర్బంగా అన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలను ఎంతగా పెంపొందించితే అంతగానూ విద్యార్థులకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.

అలాగే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు తమ బోధనా ప్రమాణాలను పెంచుకోవాలని, అలాగే దేశంలోని టాప్ 10 యూనివర్సిటీలలో చోటు సంపాదించు కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జట్టేయ వ్యవస్థీకృత ర్యాంకింగ్ ప్రక్రియలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సందర్బంగా చర్చించారు. మౌలిక సదుపాయాలను కూడా విద్యాసంస్థలలో పెంచాలని ఆ విధంగా అవి ఉన్నత ఫలితా లను సాదించేందుకు మార్గాన్ని సుగమం చేయాలనీ అధికారులను జగన్ కోరారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేస్తామని వెల్లడించిన జగన్మోహన్ రెడ్డి అందుకు ఎంత మొత్తం ఖర్చవుతుందో లెక్క వేయాలని అధికారులను కొర్రరు. కడపలో రానున్న ఆర్కిటెక్చర్ యూనివర్సిటీపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు.

విశాఖ ఉక్కు కార్మికుల నిర్ణ‌యం భేష్.. మోడీ గారూ మీక‌ర్దం అవుతోందా

రాష్ట్రంలో బోధనా ప్రమాణాలు పెంపొందాలంటే ఇతర యూనివర్సిటీలు ఏ విధమైన పద్ధతులను అనుసరిస్తున్నాయో తెలుసుకోవలసిన అవసరం ఉందని జగన్ స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పన, బోధనా విధానాలపై దృష్టి పెట్టాలని విశ్వ విద్యా లయాల్లో ప్రతిభావంతులైన వారిని బోధనా రంగంలో నియమించాలని జగన్ కోరారు. అలాగే విదేశాలు అనుసరిస్తున్న ఉత్తమ విశ్వవిద్యాలయ విధానా లను, పద్ధతులను పరిశీలించి వాటిని రాష్ట్రంలోని వర్సిటీలలో కూడా అమలు చేయాలనీ సూచించారు.

రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల పనితీరును కూడా సమీక్షించిన జగన్ శ్రీకాకుళం, ఒంగోలు లో తలపెట్టిన ట్రిపుల్ ఐ టి లను పూర్తి చేయవలసిన అవసరం ఎంతో ఉందని అన్నారు. ప్రస్తుతం రాష్టంలో ఉన్న ట్రిపుల్ ఐ టి లలో దాదాపు 23వేల మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రష్టుతం 11 వైద్య కళాశాలలే ఉన్నాయని, మరో 16 కొత్త వైద్య కళాశాలలను తీసుకురాబోతున్నామని అన్నారు. ఈ కాలేజీలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు  అవసరమైన ఉత్తమ పద్ధతులను పాటించాలని పేర్కొన్న జగన్ ఈ కాలేజీలో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద ఉంటె పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle