ఒకేచోట షర్మిల, విజయమ్మ, సునీత.. సరికొత్త సమీకరణాలా?
23-02-202123-02-2021 07:24:48 IST
Updated On 23-02-2021 10:28:42 ISTUpdated On 23-02-20212021-02-23T01:54:48.392Z23-02-2021 2021-02-23T01:54:43.799Z - 2021-02-23T04:58:42.565Z - 23-02-2021

వైఎస్ ఫ్యామిలీలో విభేదాలొచ్చాయి అనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే. తాజాగా.. షర్మిల పార్టీతో ఇంకాస్త ముదిరాయని కూడా తెలుస్తోంది. అయితే.. అవి మాత్రం బయటికి కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం ఓ ఫంక్షన్ లో మాత్రం ఈ విషయం పై కాస్త క్లారిటీస్ వస్తున్నయ్. వైఎస్ ఫ్యామిలీలో నిజంగానే విభేదాలు వచ్చినట్లే ఉన్నయ్ అనే టాక్ వినిపిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ, ఆమె కూతురు షర్మిల ఓ ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు. ఆమెతో పాటు.. పులివెందులలో హత్యకు గురైన వివేకానంద రెడ్డి కూతురు.. డాక్టర్ సునీత కూడా ఉన్నారు. ఆయన హత్యతో చాలా విషయాలు అప్పట్లో హాట్ డిస్కషన్ అయ్యాయి. వైఎస్ ఫ్యామిలీపై కూడా అనుమానాలు వచ్చాయి. వాళ్ల మధ్య విభేదాలు కూడా ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ.. విజయమ్మ, సునీత, షర్మిలు మాత్రం ఒకే వేదికపై ఉండగా.. సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి మాత్రం ఆ ఫంక్షన్ కు అటెండ్ కాలేదు. వీరంతా అటెండ్ అయ్యే ఫంక్షన్ అంటే.. అందరికీ ఇంపార్టెంటే కదా.. జగన్ ఎందుకు రాలేదు.. ఆయన భార్య ఎందుకు రాలేదు అనే పాయింట్ ఇంట్రస్టింగ్ గా మారింది. సీఎం జగన్ అంటే వంద పనులు ఉంటయ్. సీఎం కదా.. ఆ మాత్రం హడావిడి ఉంటుంది. ఒక వేళ.. ఎంత ఇంపార్టెంట్ ఫంక్షన్ అయినా కొన్ని సార్లు రావడం కుదరకపోవచ్చు.. అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా. కానీ.. భారతి కూడా రాకపోవడంతో.. అవునా, నిజమా రాలేదా అనుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. సిట్ దర్యాప్తు నుంచి సీబీఐకి వెళ్లాక.. వివేకానంద రెడ్డి కేసు విషయం సీరియస్ అయిందని.. ఆ తర్వాత వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయి అని.. ఈ ఫంక్షన్ కి వెళ్లిన వాళ్లు గుసగుసలాడుతున్నారట. విభేదాల మాట నిజమే కావచ్చునేమో అనుకుంటున్నారు జనాలు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
7 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
9 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
10 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
11 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
11 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
11 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
12 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
2 hours ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
10 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
13 hours ago
ఇంకా