సీఎం జగన్ రెండో భార్యనంటూ మహిళ హల్చల్.. క్యాంప్ ఆఫీసుకే..
14-01-202114-01-2021 07:23:26 IST
Updated On 14-01-2021 07:31:48 ISTUpdated On 14-01-20212021-01-14T01:53:26.051Z14-01-2021 2021-01-14T01:48:22.790Z - 2021-01-14T02:01:48.926Z - 14-01-2021

ముఖ్యమంత్రుల పర్సనల్ లైఫ్ చాలా వరకూ తెరచిన పుస్తకమే..! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి గురించి కూడా మనకందరికీ తెలుసు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వైఎస్ జగన్ తన దారిలో తాను వెళుతూ ఉండగా.. ఓ మహిళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో భార్యనంటూ హల్చల్ చేసింది. ఏపీ సీఎం రెండో భార్యనంటూ ఓ మహిళ చెప్పుకుంటూ వచ్చింది. అది కూడా క్యాంపు ఆఫీసు దాకా వెళ్ళింది. అక్కడితో ఆగని ఆమెఅడ్డుకోబోయిన స్థానికులపై రాళ్లు రువ్వింది. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులపైనా కోపాన్ని ప్రదర్శించింది. తాను సీఎం రెండో భార్యనంటూ హంగామా సృష్టించింది. సీఎం క్యాంప్ ఆఫీస్, నివాసముంటున్న తాడేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు షాక్ కు గురయ్యారు. ముఖ్యమంత్రి ఇంటికి అతి సమీపంలో ఉండే తాడేపల్లి మహానాడులో ఈ ఘటన జరిగింది. అయితే ఆమెకు మతిస్థిమితం లేదని తెలియడంతో పోలీసులతో పాటూ, అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణా నదీతీరం వెంబడి ఉన్న మహానాడులో మతిస్థిమితం లేని మహిళ గురించే చాలా మంది మాట్లాడుకున్నారు. తాను ముఖ్యమంత్రి రెండో భార్యనంటూ ఆమె నానా హంగామా చేసింది. ఆమె మానసిక పరిస్థితి బాగోకపోవడంతో స్థానికులు ఆమెను నియంత్రించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె ఏ మాత్రం తగ్గలేదు. స్థానికుల మీదకే ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.. వారిపై తిరగబడింది. రాళ్ల దాడికి ప్రయత్నించింది. దీంతో స్థానికులు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తీరా చూస్తే ఆమె మతిస్థిమితం లేని గుర్తించారు. ఆ మహిళను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. చిలకలూరిపేటకి చెందిన ధనలక్ష్మిగా ఆమెను గుర్తించారు. మహానాడుకు చెందిన ఓ వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏపీ సీఎం రెండో భార్యనంటూ ఆ మహిళ చెప్పుకోవడంతో ఒక్క సారిగా అందరూ షాక్ కు గురయ్యారు. కానీ ఆమెకు మతిస్థిమితం లేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..
3 hours ago

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!
8 hours ago

తెలంగాణ పాలిటిక్స్ లోకి దర్శకుడు రాఘవేంద్ర రావు
9 hours ago

అంబటి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్
7 hours ago

ఎన్నికలకు వెళ్లకుంటే.. ఏపీ సర్కార్ కి సీరియస్ ప్రాబ్లమే.. ఎలాగో తెలుసా..?
10 hours ago

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక
5 hours ago

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు
4 hours ago

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక
11 hours ago

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హజారే
11 hours ago

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ
9 hours ago
ఇంకా