newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఆ లేఖతో జగన్‌కు లాభమా నష్టమా - 1

18-10-202018-10-2020 08:44:39 IST
Updated On 19-10-2020 10:24:44 ISTUpdated On 19-10-20202020-10-18T03:14:39.125Z18-10-2020 2020-10-18T03:14:34.652Z - 2020-10-19T04:54:44.666Z - 19-10-2020

ఆ లేఖతో జగన్‌కు లాభమా నష్టమా - 1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ చరిత్రలో ఇంతవరకూ కనీవినీ ఎరుగని అరుదైన ఘట్టం! న్యాయవ్యవస్థను, రాజకీయవ్యవస్థను అతి పెద్ద కుదుపుకు లోను చేసిన సంఘటన ఇటీవలి కాలంలో జరగలేదు. అత్యంత దుర్భేద్యమైన న్యాయవ్యవస్థ మీద నోరు విప్పడానికి తలపండిన రాజకీయవేత్తలు సైతం భయపడతారు. చాలా సున్నితంగా ఉండే న్యాయమూర్తులపై నిందలతో బాధిస్తే ఆ ప్రభావం వారి వృత్తిపై పడుతుందనే ఉద్దేశంతో రాజ్యాంగపరంగా న్యాయమూర్తులకు రక్షణ కల్పించారు. వారిని విమర్శిస్తే కంటెంప్ట్ అఫ్ కోర్ట్ కింద కేసు పెట్టి శిక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది.  అందుకే వారి తీర్పులు నచ్చినా నచ్చకపోయినా వారిని విమర్శించడానికి ఎవరూ సాహసించరు.

అలాంటి పరిస్థితుల్లో ఏకంగా న్యాయవ్యస్థపై రణభేరి మోగించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు ఎలా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారో, తన ప్రభుత్వాన్ని ఎలా అడ్డుకుంటున్నారో, ఏవిధంగా చంద్రబాబు కోరికలను.. శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని తీర్చుతున్నారో, వారికి సుప్రీమ్ కోర్టు సీనియర్ తెలుగు న్యాయమూర్తి ఎలా సహకరిస్తున్నారో ఆధారాలు సాక్ష్యాలతో సహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మొన్న ఢిల్లీ వెళ్ళినపుడు అందించినట్లు ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లమ్ ప్రకటించడం యావద్దేశం నిర్ఘాంతపోయింది!  

ఎసిబి విచారణలు అడ్డుకోవడం, నేరగాళ్లకు రక్షణగా నిలవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ నైతికంగా బలహీనను చెయ్యడానికి న్యాయమూర్తులు ప్రయత్నించడం మొదలైన అక్రమాలకు గౌరవ హైకోర్టు పాల్పడుతున్నదని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకంతో సుప్రీమ్ కోర్టుకు లేఖ వెళ్లడం ప్రకంపనలు సృష్టించింది. జాతీయస్థాయి పత్రికలు ఆ లేఖను హెడ్ లైన్స్‌లో ప్రచురించాయి. కొన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ జగన్ చేసిన ఫిర్యాదుపై ట్వీట్స్ చేశాయి.

ఎప్పుడో రావలిసిన లేఖ ఇప్పుడొచ్చిందా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర హైకోర్టుకు మధ్య యుద్దం జరుగుతోందా అనిపించేంతగా గత కొద్ది నెలల్లో పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి లేఖ ప్రభుత్వాధినేత నుంచి వస్తుందని చాలా మంది ఊహించారు. గత ఏడాది కాలంగా తమ ప్రభుత్వాన్ని చీకాకు పెడుతున్నప్పటికీ, వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగ వ్యవస్థ అయిన ప్రభుత్వాన్ని కించపరుస్తున్నా కిమ్మనకుండా సైలెంటుగా ఉండిపోయారు. చివరకు పదిమంది కరోనా రోగుల మరణానికి కారకుడైన డాక్టర్‌ను అరెస్ట్ చెయ్యకూడదని, కేసులు పెట్టకూడదని, విచారణ చెయ్యకూడదని ప్రభుత్వ అధికారాన్ని నిలదీసేందుకు హైకోర్టు సిద్ధం కావడంతో ఏపీ ముఖ్యమంత్రి  ఇక మౌనం వహించి లాభం లేదని, తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

ఒకటి మాత్రం నిజం. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ సాహసించనంతగా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల నామధేయాలను ఉటంకిస్తూ ఒక్కొక్కరు ఎన్నెన్ని అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో, ఎవరికి మేలు కలిగే విధంగా తీర్పులు ఇస్తున్నారో సోదాహరణంగా సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి సమర్పించారంటే జగన్ ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారనేది సుస్పష్టం.

హైకోర్టు న్యాయమూర్తుల మీద ఆరోపణలు చెయ్యడం ఒక ఎత్తైతే, మరో ఆరు మాసాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న జస్టిస్ ఎన్వీ రమణపై నేరుగా పేరుపెట్టి మరీ ఆరోపణాస్త్రాలు సంధించడానికి ఎంత గుండె ధైర్యం కావాలి?  అందులోనూ తనమీద అక్రమార్జన కేసులు ఉన్నాయి. వాటి విచారణలో భాగంగా కొన్నాళ్లు రిమాండ్ ఖైదీగా గడపాల్సివచ్చింది.  వాటి మీద విచారణ జరగబోతోంది. అయినప్పటికీ అదరక బెదరక, న్యాయమూర్తుల అవినీతిపై, అక్రమాలపై జగన్ పాంచజన్యం పూరించారంటే అసలు జగన్ అంటే ఏమిటో అర్ధం కావడం లేదు. తనను కుట్రపూరితంగా  జైలుకు పంపించినా సరే,  న్యాయవ్యవస్థ అంతు తేల్చడానికి జగన్ సిద్ధమయ్యాడా అని వైసీపీ నేతలే తలపట్టుకుంటున్నారు.

ఒకటి మాత్రం నిజం.. న్యాయమూర్తులు కూడా అవినీతికి అతీతులు కారు అంటూ దేశం మొత్తం ఢంకా కొట్టి మరీ చెప్పేశాడు జగన్. ఆ లేఖపై మౌనం వహించాలన్నా, చెత్తబుట్టలో పడేయాలన్నీ ఇక ఎవరికీ సాధ్యం కాదు. తాను నీట మునిగినా సరే, తేలినా సరే న్యాయ పాక్షికతపై తేల్చుకోవలసిందేనని జగన్ నిర్ణయించుకున్నారా..

గత వారంరోజులుగా సీఎం జగన్ ఎంత పనిచేశాడు.. న్యాయవ్యవస్థపైనే యుద్ధం ప్రకటించాడు. తెలుగు న్యాయమూర్తికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశాన్ని సరైన సమయంలో గురిచూసి దెబ్బతీశాడే ఆంటూ తెలుగు మీడియాలో పుంఖానుపంఖాలుగా చర్చలు చేస్తున్నారు. ఈ చర్చలను, వాటివెనుక ఉన్న పార్టీలపరమైన పాక్షికతలను పక్కన బెట్టి చూస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి…న్యాయమూర్తుల పట్ల చేసిన ఆరోపణలను ఆధారాలతో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి సమర్పించిన తరువాత….ఆ సమర్పించిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించిన తరువాత…సుప్రీమ్ కోర్ట్ తగిన చర్యలు తీసుకోకుండా ఉండటం సాధ్యం కాదేమో!   

జగన్ ఇంతటితో ఆగుతారని కూడా చెప్పడానికి వీల్లేదు. సుప్రీమ్ కోర్ట్ చర్యలు సంతృప్తికరంగా లేకపోతే ప్రధానమంత్రి, రాష్ట్రపతిని సైతం కలిసి మళ్ళీ వినతిపత్రాలు ఇచ్చే అవకాశం ఉన్నది. సీనియర్ తెలుగు న్యాయమూర్తి జగన్ లిఖిత పూర్వకంగా చేసిన ఆరోపణల కారణంగా ఆయన విచారణ ఎదుర్కోక తప్పదేమో…తాత్కాలికంగానైనా ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకం ఆగిపోతుంది.  న్యాయవిచారణ జరిగితే తక్షణం జరిగేది అదే. తాత్కాలికంగా అయినా, ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేంతవరకైనా ఆ సీనియర్ న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాగల అవకాశం పక్కకు పోయినట్లే.

ఏ విధంగా చూసినా, ఏపీ ముఖ్యమంత్రి విసిరిన ఆఘాతం మామూలుగా లేదు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తుదివరకు తీసుకోకపోవచ్చు. లేక లేఖను బహిర్గతం చేశారెందుకని మందలింపులతో సరిపెట్టవచ్చు. ఈ విషయంలో జగన్‌కి ఏం జరిగినా ఫర్వాలేదు. కానీ  ఒక పటిష్టమైన వ్యవస్థలోని లొసుగులను నిర్భయంగా బయటపెట్టిన తొలి సీఎంగా జగన్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. క్రియాశీలత పేరుతో కోర్టుల వ్యవహారశైలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇతర ముఖ్యమంత్రులు కూడా జగన్‌కు చేదోడుగా నిలుస్తారు. ప్రజల్లో ఇప్పటికే న్యాయవ్యవస్థ చులకన అయిపొయింది. ఇక ప్రజలు కూడా గొంతులు విప్పాల్సివస్తుందేమో! 

ఏదేమైనా ఒక తేనెతుట్టెను కదిపిన సాహసం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. జగన్ విసిరిన ఖడ్గం వ్యవస్థల దుర్మార్గాలను ఖండిస్తుందా లేక జగన్‌నే బలి తీసుకుంటుందా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. వైఎస్ జగన్ రాసిన లేఖకు ముందూ తర్వాత అనే పరిస్థితి క్రియేట్ అయ్యాక సుప్రీంకోర్టు సెలవులు ముగిశాక పూర్తి స్థాయితో పనిచేయడం మొదలయ్యాక తప్పనిసరిగా దీనిపే ఏదో ఒక చర్య తీసుకోవలసిన పరిస్థితి తప్పదనిపిస్తోంది.

ఒక్కటి మాత్రం నిజం. ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ జగన్‌కు ఎంత లాభం, ఎంత నష్టం అనే చర్చ కన్నా తన ప్రభుత్వానికి జరుగుతున్న అన్యాయంపై మీరేమంటారు అంటూ నేరుగా సుప్రీంకోర్టునే బోనులో పెట్టాడు జగన్. దీంతో ఎలా వ్యవహరిస్తుంది అనేది సుప్రీంకోర్టు న్యాయసంధతకు, నిజాయితీకి నిదర్శనంగా నిలుస్తుంది. 130 కోట్లమంది దృష్టిలోకి విషయం వెళ్లాక మౌనంగా ఉండటం సుప్రీంకోర్టుకు సాధ్యం కాకపోవచ్చు..

ఆ లేఖ జగన్‍‌కు లాభమా.. నష్టమా -2


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle