newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రోజా, విడ‌ద‌ల ర‌జ‌నీ.. మంత్రి ప‌ద‌వి ఎవ‌రికి

20-03-202120-03-2021 12:22:04 IST
Updated On 20-03-2021 17:23:31 ISTUpdated On 20-03-20212021-03-20T06:52:04.298Z20-03-2021 2021-03-20T06:51:48.397Z - 2021-03-20T11:53:31.607Z - 20-03-2021

రోజా, విడ‌ద‌ల ర‌జ‌నీ.. మంత్రి ప‌ద‌వి ఎవ‌రికి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స‌మయం లేదు మిత్ర‌మా.. మంత్రి ప‌ద‌వి ద‌క్కే టైం వ‌చ్చింది. సోషల్ మీడియా వీరులు సిద్ధం కావ‌లెను. డ‌ప్పులు మ‌న ఖ్యాతిని న‌లుమూల‌ల విస్త‌రింపజేసేలా.. దుమ్ము రేప వ‌లెను. అంద‌రూ ఆయుధాల‌తో స‌న్న‌ద్ధం కండి. విడ‌ద‌ల ర‌జ‌నీ.. మంత్రి అనే మాట అంద‌రికీ నోటెడ్ అయిపోవాలె. చ‌రిత్రలో ఎప్పుడు మ‌న గురించి మాట్లాడుకున్నా.. మంత్రి అనే మాట లేకుండా మాట్లాడ్డానికి వీలులేదు అంటూ.. విడ‌ద‌ల ర‌జ‌నీ.. త‌న టీమ్ కి ఆదేశాలు జారీ చేశార‌ట‌. ఈ మాట బ‌య‌టికి పెద్ద‌గా రాక‌పోయినా.. ఆదేశాలు మాత్రం వెళ్లాయ‌ట‌. నిజ‌మా కాదా అనేది ప‌క్క‌న పెడితే.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ టాక్ ఫుల్ గా ఉంది. ఎందుకంటే.. చేసే ప‌నిని న‌లుగురికీ చెప్పుకోవ‌డంలో త‌ప్పేం లేదు క‌దా. ఈ విష‌యంలో ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ అండ్ టీమ్.. ఎప్పుడూ రెడీగానే ఉంటారు. 

ఇక ఎమ్మెల్యే రోజా విష‌యంలో మాత్రం త‌క్కువేం చెప్పుకుంటాం చెప్పండి. అస‌లే ఫైర్ బ్రాండ్ క‌దా. ఆమె విష‌యం కూడా ప్ర‌తిదీ ముందే సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చేస్తుంది. వారి ప్ర‌మోట‌ర్లు రెడీగా ఉంటారు క‌దా. ఇప్పుడు కూడా సూప‌ర్ యాక్టివ్ అయ్యార‌ట‌. ఎందుకో అర్దం అవుతూనే ఉంది క‌దా. ఇంకొన్నాళ్ల‌లో మంత్రి ప‌ద‌వుల పంప‌కాలు మ‌ళ్లీ ఉంటాయి క‌దా. అందుకే.. రోజా, ర‌జ‌నీలు ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇద్ద‌రికీ మౌఖిక హామీలు అందాయి అని తెలుస్తోంది. ఎందుకంటే.. ఏపీ కేబినెట్ మ‌హిళ‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంది క‌దా. ఒక వేళ మంత్రి ప‌ద‌వుల పంప‌కాలు మ‌ళ్లీ జ‌రిగితే.. కొంత‌మందికి ప‌ద‌వులు పోతాయి.. కొంత‌మందికి ద‌క్కుతాయి. ఇంకొంత‌మందికి ఉంటాయి.

ఇది ఎక్స్ పెక్ట్ చేసేదే. సో.. ఆ టైంలో.. వీళ్లిద్ద‌రికీ మంత్రి ప‌ద‌వులు ద‌క్కుతాయి అనే టాక్ న‌డుస్తోంది. ఒక‌రేమో.. మాట‌కి ముందూ వెన‌కాల ప్ర‌తి సారీ.. జై జ‌గ‌న్ అన్న అనే మాట లేకుండా ఏ మాటా మాట్లాడని చెల్లె ర‌జ‌న‌మ్మ‌, మ‌రో ప‌క్క‌నేమో.. అన్న మీద మాట ప‌డితే.. దుమ్ములేపు రోజ‌మ్మ‌. వీరిద్ద‌రికీ ప‌ద‌వులు వ‌స్తాయి అన‌డంలో ఎవ‌రికైనా డౌట్స్ ఎందుకు ఉంటాయి చెప్పండి. అయితే.. ఇక్క‌డో తిర‌కాసు ఉంది. ఇద్దరికీ కాదు.. ఒక్కరికే మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంది అనే మాట కూడా బానే వినిపిస్తోంది. మ‌రి ఆ లెక్క‌ల్లోకి వెళ్తే.. ఇద్ద‌రిలో ఎవ‌రిని జ‌గ‌న్ స‌పోర్ట్ చేస్తారు. కేబినెట్ లోకి ఎవ‌రిని తీసుకుంటారు అన్న‌ది  మ‌రికాస్త ఇంట్ర‌స్టింగ్ గా మారింది. అయితే.. రోజాకి ఫుల్ ఫేమ్ ఉంది. మ‌హిళ‌ల త‌ర‌పున బ‌లంగా మాట్లాడ‌తారు. ఆమెకు ఆ నేమ్ ఉంది కాబ‌ట్టి.. రోజాకే మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంది అనే టాక్ ఉంది. ఇక పోతే.. విడ‌ద‌ల ర‌జనీకి కూడా జ‌నంలో ఫేమ్ ఉంది. మంచి లీడ‌ర్ గా పేరుంది. పైగా జ‌గ‌న్ కి అభిమానం ఉంది. సో.. విడ‌ద‌ల ర‌జ‌నీకే మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంది అంటున్నారు. పైగా.. ప్ర‌స్తుతానికి మంత్రి ప‌ద‌వి లేకున్నా.. వేరే ప‌ద‌వి ఇచ్చి.. కూల్ చేశారు రోజాను. మ‌రి ఈ టైంలో.. ఆల్రెడీ ఒక ప‌ద‌వి ఉన్న రోజాకు మంత్రి ప‌ద‌వి ఇస్తారా... లేదంటే.. ఏ ప‌ద‌వీ లేని విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఇస్తారా అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ గా మారింది. కానీ.. ఇద్ద‌రిలో ఒక‌రికి మాత్రం మంత్రి ప‌ద‌వి ఖాయం అనే టాక్ లో అయితే ఫుల్ క్లారిటీ ఉంది.

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   12 minutes ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   15 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   11 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   18 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle