newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఏపీలో బీజేపీ, ఆ పార్టీ దోస్తులు ఏమైన‌ట్లు

12-05-202112-05-2021 10:49:01 IST
Updated On 12-05-2021 12:04:33 ISTUpdated On 12-05-20212021-05-12T05:19:01.462Z12-05-2021 2021-05-12T05:17:15.781Z - 2021-05-12T06:34:33.790Z - 12-05-2021

ఏపీలో బీజేపీ, ఆ పార్టీ దోస్తులు ఏమైన‌ట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

టైం చూసి త‌ప్పించుకుంటారు. ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు అండ‌గా  ఉండాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి..  ప్ర‌జ‌ల్ని కాపాడుకోవాలి. ఆ విష‌యంలో జ‌గ‌న్ ఎంత వ‌ర‌కు చేస్తున్నారు అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న చేత‌నైన కాడికి చేస్తున్నారు. వీలు కాని విష‌యాల్లో ప్ర‌తి ప‌క్షం, ప్ర‌జ‌ల నుంచి నానా మాట‌లూ ప‌డుతున్నారు. అందులో ఎలాంటి మొహమాట‌మూ లేదు. 

కానీ.. ఏపీ బీజేపీ లీడ‌ర్లు ఏం చేస్తున్నారు అన్న‌ది ఇప్పుడు ఇంట్ర‌స్టింగ్ గా మారింది. వైసీపీ నే కాదు. ఇప్పుడు బీజేపీ బాధ్య‌త కూడా ఉంటుంది క‌దా. ఓట్ల కోస‌మే ప్ర‌జ‌ల్లోకి వెళ్తారా బీజేపీ లీడ‌ర్లు. ప్ర‌జ‌ల్ని ప‌ట్టించుకోరా. కేంద్ర ప్ర‌భుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ లీడ‌ర్లు ఏం చేస్తున్నారు. ఏపీ కోసం ఏమైనా చేస్తున్నారా లేదా. తెలంగాణ లాగే మేం కూడా ప‌వ‌ర్ చూపిస్తాం అన్నారు క‌దా బీజేపీ లీడ‌ర్లు.. ఇప్పుడేమైంది. అంతేనా. తెలంగాణ నుంచి వ‌చ్చి మ‌రీ.. ఏపీ జ‌నాల్ని ఓట్లు అడిగారు క‌దా. బైబిల్ కావాలా.. భ‌గ‌వ‌ద్గీత కావాలా అంటూ డైలాగులు దంచిన లీడ‌ర్లు కూడా ఉన్నారు క‌దా. వాళ్లంతా ఏమై పోయారు. ప్ర‌జ‌ల కోసం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు క‌దా. ఇప్పుడేం చేస్తున్నారు అంటూ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక ప‌వ‌నాల్ సార్ ఉన్నారు క‌దా. బీజేపీ అన‌గానే.. తుర్రున జ‌నంలోకి వ‌స్తారు క‌దా. మ‌రి ఇప్పుడు నిల‌దీయాలి క‌దా. మ‌రి మేం మీకోసం జ‌నంలోకి వ‌చ్చాం.. జ‌నాన్ని ఓట్ల‌డిగాం..  ఇప్పుడు ఆ జ‌నం కోసం మీరు ఏం చేస్తున్నారు అని ప్ర‌శ్నించాలి క‌దా. అస‌లు ప్ర‌శించ‌డానికే పుట్టింది క‌దా జ‌న‌సేన‌. మ‌రి జ‌నం కోసం ఏం  చేస్తుంది. పైగా బీజేపీ అంటే ప్ర‌భుత్వంలో ఉంది. జ‌న‌సేన కాదు క‌దా. దోస్తు పార్టీ అయిన బీజేపీని నిల‌దీయాలి. అలాగే ప్ర‌భుత్వంలో ఉన్న వైసీపీని కూడా ప్ర‌శ్నించాలి క‌దా. ప్ర‌శ్నించ‌డానికే మొద‌లెట్టిన ప‌వ‌న్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది. అధికారంలో ఉన్న బీజేపీ లీడ‌ర్లు ఎక్క‌డ నిద్ర‌పోతున్నారు అంటూ.. పొలిటిక‌ల్ గా డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. అస‌లు ఈ రెండు పార్టీల గురించి డిస్క‌ష‌న్ న‌డుస్తుంది అంటే.. కూడా కాస్త విడ్డూరంగానే  ఉంటుంది క‌దా. కానీ.. జ‌నం మ‌ర్చిపోరు క‌దా. యాడ‌పొయ్యిర్రు సామే అంటూ.. తిట్టుకోవ‌డానికి అయినా.. గుర్తు చేసుకుంటారు క‌దా.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle