newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

స్థానిక హీట్.. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య టగ్ ఆఫ్ వార్!

24-10-202024-10-2020 18:25:26 IST
Updated On 24-10-2020 18:53:14 ISTUpdated On 24-10-20202020-10-24T12:55:26.462Z24-10-2020 2020-10-24T12:55:13.775Z - 2020-10-24T13:23:14.087Z - 24-10-2020

స్థానిక హీట్.. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య టగ్ ఆఫ్ వార్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఒక విధమైన అయోమయ వాతావరణం నెలకొని ఉంది. పాలనలో పారదర్శకత లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా, స్వేచ్ఛగా పని చేయలేని పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగు కదిపినా అది ప్రభుత్వానికి తప్పుగా తోస్తున్నది. గతంలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు ముందుకు రాకుండా కరోనా కారణంగా ఏకపక్షంగా వాయిదా వేశారంటూ వైకాపా సర్కార్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్( ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వేటు వేసింది.

అయితే కోర్టు అక్షింతలతో ఆయన తిరిగి విధుల్లోకి వచ్చారు. అక్కడితో ఆ అంకం ముగిసిందని భావించాల్సిన సర్కార్ పంతానికి పోయి ఎస్ఈసీ విధులకు అడుగడుగునా అడ్డంకులు తగులుతున్న ఫలితమే..నిమ్మగడ్డ ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణకు సహకరించడం లేదనీ, కార్యాలయానికి నిధులు విడుదల చేయలేదనీ పేర్కొంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు...ఆ పిటిషన్ పై విచారణ పూర్తయ్యింది. తీర్పు రిజర్వ్ లో ఉంది. ఇక కోవిడ్ నియంత్రణలోనికి వచ్చిందని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించిన దరిమలా స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సమాయత్తం అయ్యారు.

అంతే...గతంలో కోవిడ్ ఏమిటి? ఆ మహమ్మారితో సహజీవనం చేయాల్సిందే. కోవిడ్ పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేస్తారా? ముఖ్యమంత్రిని నేనా? ఆయనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ ఇప్పుడు అదే కోవిడ్ పేరు చెప్పి స్థానిక ఎన్నికలు వద్దంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లా స్థానిక ఎన్నికలు గడువు మేరకు నిర్వహించాల్సిన అవసరం ఏమీ లేదని మంత్రి గౌతం రెడ్డి సెలవిచ్చారు. ‘ స్థానిక’ ఎన్నికల వ్యవహారం మరోసారి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య రగడకు కారణం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే...ఎస్ఈసీగా నిమ్మగడ్డ ఉన్నంత వరకూ అదే సమయంలో తన పదవీ కాలం పూర్వవ్వడానికి ముందే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలన్న పట్టుదల నిమ్మగడ్డలో కనిపిస్తున్నది.

ఏది ఏమైనా రాజ్యాంగ వ్యవస్థల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రభుత్వాలు హరించడం అన్నది ఏ రకంగానూ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏపీ సర్కార్ ఈ విషయాన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచింది.

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

   6 hours ago


నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

   6 hours ago


కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

   6 hours ago


కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

   7 hours ago


ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

   9 hours ago


టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

   9 hours ago


సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

   9 hours ago


 ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

   10 hours ago


సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

   10 hours ago


వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

   10 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle