newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!

03-03-202103-03-2021 19:54:31 IST
Updated On 04-03-2021 09:51:33 ISTUpdated On 04-03-20212021-03-03T14:24:31.481Z03-03-2021 2021-03-03T12:18:08.005Z - 2021-03-04T04:21:33.335Z - 04-03-2021

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ జిల్లా వైసీపీలో విభేదాలు ఉన్నాయని చాలా రోజుల నుండే ప్రచారం సాగుతూ ఉంది. ఈరోజు కూడా అది మరోసారి నిరూపితమైంది.  గంటా శ్రీనివాసరావు అనుచ‌రుడు, టీడీపీ నేత కాశీ విశ్వనాథం విశాఖపట్నంలో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో పాటు ప‌లువురి స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. ఆయ‌న‌ను కండువా క‌ప్పి పార్టీలోకి  విజ‌య‌సాయిరెడ్డి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి అవంతి శ్రీనివాస్ హాజ‌రు కాక‌పోవ‌డం కూడా హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నేత కాశీ విశ్వనాథం వైసీపీలో చేరడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

కాశీ విశ్వనాథం చేరిక కార్యక్రమానికి అవంతి హాజరుకాకపోవడం కూడా ఈ చర్చకు మరింత ఊతమిస్తోంది. అవంతితో ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆయనతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి అవంతి శ్రీనివాసరావుతో తనకు వ్యక్తిగత అభిప్రాయ భేదాలు లేవని కాశీ విశ్వనాథం అన్నారు. ప్రజారాజ్యంలో కలసి పనిచేశామని, ఆయన తనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తనకు తెలియదన్నారు.  అవంతిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంటానన్నారు. 

ఈ కార్యక్రమంలో విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ... ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా కొన‌సాగుతోన్న సీఎం వైఎస్‌ జ‌గ‌న్ పాల‌న చూసే చాలా మంది వైసీపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. సంవత్సరం క్రితమే కాశీ పార్టీలో చేరాల్సింది. కొన్ని కారణాలు వలన అవ్వలేదు. జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులందరు కాశిని పార్టిలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసుకొని జీవిఎంసి ఎన్నికల్లో విజయం సాధించాలని విజయసాయి రెడ్డి అన్నారు.

గంటా శ్రీనివాస‌రావు త‌మ‌కు కొన్ని ప్రతిపాద‌న‌లు పంపారని విజయసాయి రెడ్డి చెప్పారు. వైఎస్ జ‌గ‌న్ ఆమోదం త‌ర్వాత గంటా శ్రీనివాస‌రావు వైసీపీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడం ఇష్టం లేదని చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే అవంతి శ్రీనివాసరావు వర్గీయులను పార్టీలో చేర్పించుకోవడం ఇష్టం లేకనే హాజరు అవ్వలేదని చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో వైజాగ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle