newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాష్ట్ర బంద్ లో విజయసాయి రెడ్డికి చేదు అనుభవం

06-03-202106-03-2021 09:15:10 IST
2021-03-06T03:45:10.429Z06-03-2021 2021-03-06T03:44:57.278Z - - 11-04-2021

రాష్ట్ర బంద్ లో విజయసాయి రెడ్డికి చేదు అనుభవం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిన్న చేపట్టిన బంద్ విజయవంతమైందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేస్తారని అన్నారు. 

ఇక రాష్ట్ర బంద్‌ సందర్భంగా విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మద్దిలపాలెం కూడలిలో వామపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి విజయసాయిరెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో హాజరై తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.  మానవహారంగా ఏర్పడిన ఒక్కొక్కరి వద్దకు మైక్‌ను తీసుకువెళ్లి, బంద్‌తోపాటు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై తమ అభిప్రాయాలను చెప్పాలని కోరారు. ఈ క్రమంలో సీఐటీయూ కార్యకర్త సురేశ్‌ వద్ద మైక్‌ పెట్టి తన అభిప్రాయం చెప్పాలని కోరారు. 

 ‘ముందు మీరు పోస్కోతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయండి’ అని కోరారు. 

షాక్ తిన్న విజయసాయిరెడ్డి ‘ఒప్పందం ఎవరు చేసుకున్నారు?’అని ప్రశ్నించారు.

సురేశ్‌...‘ఎవరు చేసుకున్నా, అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆ పనిచేయండి’ అని సమాధానం ఇచ్చారు. 

తీవ్ర అసహనానికి గురైన విజయసాయిరెడ్డి ‘ఆ ఒప్పందంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం కూడా లేదు. నీకు లేని అధికారాన్ని నువ్వు ప్రదర్శించలేవు’ అని అంటూ అక్కడి నుంచి మైక్‌ తీసుకుని వెళ్లిపోయారు.  విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త బంద్‌ విజయవంతమైంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు మేరకు బీజేపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ మద్దతుగా నిలవడంతో రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ ప్రశాంతంగా జరిగింది. బంద్‌లో వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, టీడీపీలతోపాటు కార్మిక, ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్తక, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్డెక్క లేదు. డిపోల నుంచి బస్సులు బయటకు తీయబోమని ఆర్టీసీ కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్‌ యూనియన్, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్, వైఎస్సార్‌ మజ్దూర్‌ యూనియన్, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రకటించాయి. అన్ని జిల్లాల్లో అన్ని యూనియన్లకు చెందిన కార్మికులు సైతం బస్టాండ్ల వద్ద ఆందోళనకు దిగడంతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బంద్‌కు మద్దతు పలికిన లారీ యాజమానుల సంఘం ఆందోళన కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. కాకినాడ సీపోర్ట్‌లో కార్మికులు బంద్‌ ప్రకటించడంతో అక్కడి కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతపురంలో వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. బంద్‌కు ప్రభుత్వ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   16 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle