newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

23-04-202123-04-2021 08:46:32 IST
Updated On 23-04-2021 11:19:35 ISTUpdated On 23-04-20212021-04-23T03:16:32.258Z23-04-2021 2021-04-23T03:13:36.526Z - 2021-04-23T05:49:35.253Z - 23-04-2021

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మెగాస్టార్ అంటే మెగాస్టారే సుమీ. రాజ‌కీయంగా త‌ను అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యుండొచ్చు. అఫ్ కోర్స్.. తమ్ములం వారు పవనాలం కంటే దారుణం అయితే కాదు కానీ.. బ‌ట్.. ఫ్లాప్ అని మాత్రం అనొచ్చు. అయితే.. త‌మ్ముడు రాజ‌కీయాల్లో ఉండి కూడా మాట్లాడ‌లేని మాట‌లు.. పాయింట్స్ లాగుతూ.. ప్ర‌జ‌ల త‌రుపున నిల‌బ‌డడంలో.. ప‌వ‌న్ కంటే అన్న‌య్య మెగాస్టారే బెట‌ర్ అని వినిపిస్తోంది. అందుకే త‌ను మెగాస్టార్ అయ్యారు అనుకుంటున్నారు జనాలు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన పాయింట్ కి అంద‌రూ ఫిదా అవుతున్నారు. నిజ‌మే.. క‌రోనా పేషెంట్ల‌కి ఇప్పుడు విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ఊపిరి పోస్తోంది. ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న వారిని బ‌తికిస్తోంది. చావు బ‌తుకుల మ‌ధ్య ఉన్న వారిని కాపాడుకోవ‌డానికి డాక్ట‌ర్ల‌కి కావాల్సినంత టైం ఇస్తోంది. ఎందుకంటే.. ఇక్క‌డి నుంచి.. క‌రోనా పేషెంట్ల‌కి ఆక్సిజ‌న్ వెళ్తోంది. క‌రోనా పేషెంట్లు ముఖ్యంగా ఎందుకు చ‌నిపోతారో అంద‌రికీ తెలిసిందే క‌దా. ఊపిరి అందేంత వ‌ర‌కూ బాగానే ఉంటారు. కానీ.. ఆక్సిజ‌న్ అంద‌ని టైంలోనే చ‌నిపోతారు. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల కోసం జ‌నాలు క్యూల్లో నుంచుంటున్నారు. రాష్ట్రాల‌కి రాష్ట్రాలు ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల కోసం ఫైటింగ్ చేస్తున్నారు. ప్ర‌భుత్వాలు దొంగ‌త‌నాలు చేస్తున్నాయి. హాస్పిట‌ల్స్ లో డాక్ట‌ర్లు అయితే.. పేషెంట్ల‌కి ఆక్సిజ‌న్ అందించ‌లేక‌.. వారి ప‌రిస్థితి చూసి త‌ట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇలాంటి ప‌రిస్థితిలో.. మ‌హారాష్ట్ర నుంచి ఓ ప్ర‌త్యేక రైలు వ‌చ్చింది. ఎందుకో తెలుసా. 150 ట‌న్నుల ఆక్సిజ‌న్ తీసుకెళ్ల‌డానికి. ఇది ప్ర‌త్యేక అవ‌స‌రం కాబ‌ట్టి.. ప్ర‌త్యేకంగా  వ‌చ్చింది. మామూలుగా కూడా విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌లో ఉత్ప‌త్తి అయ్యే వంద ట‌న్నుల ఆక్సిజ‌న్ క‌రోనా పేషెంట్ల‌కి వెళ్తుంది. రోజుకి వంద ట‌న్నుల ఆక్సిజ‌న్ అంటే ఆలోచించండి. ఎంత మంది ప్రాణాలు కాపాడుతుందో. ప్ర‌త్యేకంగా రైలేసుకుని వ‌చ్చి తీసుకెళ్లేంత అండ‌గా ఉంటోంది విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌. అలా ప్రాణాలు కాపాడే సంజీవ‌ని లాంటి విశాఖ ఉక్కుని అమ్మ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ చెప్పండి. అదే అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి  ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను అమ్ముకుంటారా అని నిల‌దీస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఈ విష‌యంపై బ‌లంగానే మాట్లాడారు మెగాస్టార్ చిరంజీవి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అంటూ అప్ప‌ట్లో చేసిన పోరాటంలో.. చిన్న‌ప్పుడు త‌ను కూడా పాల్గొన్న విష‌యాన్ని గుర్తు చేసుకుని.. అమ్మొద్దు అంటూ రిక్వ‌స్ట్ చేశారు. ఇప్పుడు కూడా మ‌రోసారి అదే అంటున్నారు మెగాస్టార్. అవును నిజ‌మే.. కేంద్రానికి అంటే.. మ‌న విశాఖ ఉక్కు గురించి తెలీక పోవ‌చ్చు.. క‌నీసం రాష్ట్ర ప్ర‌భుత్వం అయినా.. తెలుసుకుని కాపాడుకోవాల్సిన బాధ్య‌త‌.. స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ పై ఉంది అంటున్నారు జ‌నాలు. ఒక్క‌సారి ఊహించుకోండి.. అదే విశాఖ ఉక్కు ప్రైవేటు వారి చేతిలో ఉండి.. ఇంత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా అవుతుంటే.. వారి డిమాండ్ ఏ రేంజ్ లో ఉండేదో.. ట‌న్ను ఎంత‌కి అమ్మే వారో ఊహించుకోవ‌చ్చు.

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   22 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   an hour ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   an hour ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle