విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
04-03-202104-03-2021 08:18:59 IST
Updated On 04-03-2021 09:43:31 ISTUpdated On 04-03-20212021-03-04T02:48:59.441Z04-03-2021 2021-03-04T02:48:45.200Z - 2021-03-04T04:13:31.818Z - 04-03-2021

ఏం మోడీనో ఏమో. గవర్నమెంట్ ని చూసుకోవయ్యా సామే అంటే.. గవర్నమెంటు కాదు.. అంతా ప్రైవేటే చూసుకుంటుందీ అంటున్నారు పీఎం మోడీ. మరి ఆ మాత్రం దానికి మీరు ప్రభుత్వ పెద్దగా ఎందుకయ్యా అంటే.. ప్రభుత్వం మొత్తాన్ని ప్రైవేట్ పరం చేయడానికయ్యా అన్నట్లు చేస్తున్నారు. అస్సలే జనాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ప్రభుత్వాన్ని.. ఇప్పుడు మళ్లీ ఇంకో ప్రైవేటీకరణ నెత్తిన పెట్టుకున్నారు పీఎం మోడీ సారు. పీఎం అంటే ఎవరు చెప్పండి. దేశ ప్రభుత్వం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని చూసుకోవాలి. పీఎం మోడీ అంత పెద్ద పవర్ ఫుల్ లీడర్ అనే కదా.. అంత టాలెంట్ ఉంది అనే కదా ఆయనకి ప్రభుత్వం మొత్తాన్ని అప్పజెప్పింది. దేశ ప్రజల భవిష్యత్ మొత్తాన్ని ఆయన చేతిలో పెట్టింది. కష్ట నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నీటినీ దారికి తీసుకొచ్చి.. బ్రహ్మాండంగా నడపాలి కదా. అది కదా.. పీఎం చేయాల్సిన పని. ఈయనగారేమో.. ప్రభుత్వం నడిపితే నష్టాలు వస్తున్నయ్. ప్రభుత్వం నడపడానికి చేత కాదు అంటూ.. ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇంటి పెద్ద ఇంట్లో ఉన్న పిల్లల్ని అందరినీ చూసుకోవాలి. వారి ఆకలి తీర్చాలి.. అందరితో పనులు చేయిస్తూ.. తానూ చేస్తూ.. ఎలాగోలా నెట్టుకురావాలి. కొన్నాళ్లలో గట్టుకు చేరాలి. కష్టాల నుంచి బయట పడాలి. అంతే కానీ.. పిల్లల్ని పెంచలేక.. ఎవరికి పడితే వాళ్లకి అప్పగిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. మీరు పెంచుకోండి.. మీరు తీసుకెళ్లండి అంటూ.. పిల్లల్ని అందరినీ కనిపించిన ప్రతి వారికీ అప్పజెప్పి.. రిలాక్స్ అవుతానంటే.. ఆ కుటుంబ పెద్దని ఏమంటారు చెప్పండి. ఇప్పుడు పీఎం మోడీ చేస్తున్న పని కూడా అలాగే ఉంది అనేది జనం వాదన. సమర్థంగా నడపాలి కానీ.. అసమర్థంగా అప్పజెబితే ఎలా సామే అంటున్నారు. కానీ.. మోడీ ఏ మాత్రం వినడం లేదు. మొన్నటికి మొన్న విశాఖ ఉక్కుని ఇలాగే చేశారు. ఏపీ సర్కార్ ఏమో.. కిమ్మనకుండా గమ్మునుండిపోయింది. మరి వాళ్ల ఫ్రెండ్షిప్ అలాంటిది.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలిసి కూడా.. మోడీతో గొడవ పడలేక పోయింది. ఇప్పుడు విశాఖ ఉక్కు తర్వాత.. విశాఖ పోర్టుపై కన్నేసింది కేంద్ర ప్రభుత్వం. విశాఖ పోర్టు కూడా త్వరలోనే ప్రైవేటు చేతుల్లోకి వెళ్లబోతుంది. మొన్నీ మధ్య జగన్ మేం చూసుకుంటాం అని కూడా చెప్పారట మోడీకి. టాక్ అలా ఉంది. కానీ.. మోడీ ఏమో జగన్ మాటని లెక్క చేయనట్లే ఉన్నారు. త్వరలోనే పోర్టుల ప్రైవేటీకరణకు సంబంధించి కొత్త చట్టాలేవో రాబోతున్నాయి అట. ఆ చట్టాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న పోర్టుల నిర్మాణం, నిర్వహణ అన్నీ ప్రైవేట్ పరం చేస్తారట. ఆ లిస్ట్ లో మన విశాఖ పోర్టు మాత్రం ఎందుకు ఉండదు చెప్పండి. మరి విశాఖ పోర్టు కూడా ఉంటే.. సీఎం జగన్.. విశాఖ ఉక్కుని వదిలేసినట్లే వదిలేస్తారా.. లేదంటే.. ఉద్యమం చేస్తారా చూడాలి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
12 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా