కనకదుర్గమ్మ గుడిలో 13 మంది అవినీతి ఉద్యోగుల సస్పెన్షన్..
23-02-202123-02-2021 18:16:28 IST
Updated On 23-02-2021 18:17:43 ISTUpdated On 23-02-20212021-02-23T12:46:28.013Z23-02-2021 2021-02-23T08:35:28.154Z - 2021-02-23T12:47:43.906Z - 23-02-2021

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ గుడిలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ ఉన్నారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! తాజాగా ప్రభుత్వం అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంది. అవినీతికి అలవాటు పడిన 13 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గుడిలో ఐదు రోజుల పాటు ఏసీబీ అధికారులు దాడులు చేసి, పలు కీలక పత్రాలను, అవినీతి ఆధారాలను గుర్తించి, ప్రభుత్వానికి నివేదికను ఇచ్చింది భారీ అక్రమాలు జరిగినట్టు నిర్ధారించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సస్పెండ్ అయిన వారిలో ఐదుగురు సూపరింటెండెంట్ స్థాయి అధికారులు ఉన్నారు. దేవాలయం భూములు, షాపుల లీజు, దర్శనాల టికెట్ల అమ్మకం, చీరల అమ్మకం, అన్నదానం, ప్రసాదాల తయారీ వంటి అన్ని చోట్లా అవినీతికి పాల్పడినట్టు తేలింది. వీరందరినీ తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్టు దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున్ రావు ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుత పాలకమండలి హయాంలో జరుగుతున్న పనులపైనే కాకుండా.. గత నాలుగేళ్ల ఫైళ్లను పరిశీలించారు. గత పాలకమండలి హయాంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అప్పట్లో జరిగిన అన్ని పనులకు సంబంధించిన ఫైళ్లను తవ్వి తీశారు. కొండపై అభివృద్ధి పనులు, ఇంజినీరింగ్, టెండర్ల పనుల డేటా సేకరించారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఈ ఘటనలపై స్పందించారు. చర్యలు తీసుకోవాల్సింది అమాయకపు చిరుద్యోగులపై కాదని అన్నారు. ఈ వ్యవహారంలో అసలు దొంగ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అని, సీఎం జగన్ చర్యలు తీసుకుంటే వెల్లంపల్లిపైనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది టెండర్ల విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. లడ్డూ ప్రసాదాలు, టిక్కెట్, చీరల కౌంటర్లతో పాటు టోల్ గేట్, కేశ ఖండనశాల, ప్రొవిజన్ స్టోర్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఏ ఫైల్ తీసినా అవినీతిమయమైనట్లు ఏసీబీ టీమ్స్ నిర్ధారించాయి. ఈ స్థాయిలో అక్రమాలు సాగుతున్నా ఈవో సురేశ్‌బాబు ఎందుకు పట్టించుకోవడాన్ని ఏసీబీ అనుమానిస్తోంది. దేవస్థానంలో ఏ పనిచేసినా.. వాటికి సంబంధించిన ఫైళ్లను ఈవో పరిశీలించాకే అప్రూవ్ చేయాలి. కానీ.. ఇంద్రకీలాద్రిపై ఇలాంటి రూల్స్ పాటించట్లేదని ఏసీబీ తేల్చింది.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
7 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
9 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
10 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
10 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
10 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
11 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
11 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
an hour ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
9 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
12 hours ago
ఇంకా