newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం

16-10-202016-10-2020 12:32:44 IST
Updated On 16-10-2020 12:34:19 ISTUpdated On 16-10-20202020-10-16T07:02:44.950Z16-10-2020 2020-10-16T07:00:43.641Z - 2020-10-16T07:04:19.306Z - 16-10-2020

విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజయవాడలో నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ రోజు ప్రారంభించారు. వర్చువల్‌ కార్యక్రమం ద్వారా ఈ  ప్రారంభోత్సవం జరిగింది. సీఎం క్యాంప్ కార్యాలయం నుండి ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు, ఢిల్లీ నుంచి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. రూ.502 కోట్లతో, ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర ఈ వంతెనను నిర్మించారు. 900 పని దినాలలో దీన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఫ్లై ఓవర్ ప్రారంభం  తర్వాత రూ.7,584 కోట్లతో నిర్మించనున్న మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. రూ.8,007 కోట్ల రూపాయలతో ఇప్పటికే పూర్తయిన పది ప్రాజెక్టులను వారు జాతికి అంకితం చేశారు.

ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం రూ.7584 కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. మొత్తం రూ.15,592 కోట్ల రూపాయల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పటికే రూ.8,007 కోట్ల రూపాయలతో పూర్తైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్‌లు జాతికి అంకితం ఇచ్చారు. కాగా, రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన నిర్మించబడింది. గతంలో పలు మార్లు ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించాలని చూశారు. కానీ కొన్ని కారణాల వలన ప్రారంభోత్సవం వాయిదా పడింది. నితిన్ గడ్కరీ కరోనా నుండి కోరుకున్న తర్వాత ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle