newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?

29-09-202029-09-2020 16:15:56 IST
Updated On 29-09-2020 16:23:08 ISTUpdated On 29-09-20202020-09-29T10:45:56.295Z29-09-2020 2020-09-29T10:45:04.663Z - 2020-09-29T10:53:08.220Z - 29-09-2020

ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ నాయ‌కులు వైసీపీ నేత‌ల‌కు అంత చుల‌క‌నైపోయారా?  బీజేపీ నాయ‌కుల‌ను అంత అలుసుగా చూస్తున్నారా? వైసీపీ నేత‌లు ఎంతెంత మాట‌ల‌న్నా బీజేపీ నాయ‌కులు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు? ఎందుకు నిస్స‌హాయంగా మిగిలిపోతున్నారు? ఇవి ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్న ప్ర‌శ్న‌లు. బీజేపీ నాయ‌కుల్ని కుల‌, మ‌తప‌రంగానే కాదు వ్య‌క్తిగ‌తంగా కూడా కించ‌ప‌రుస్తున్నారు. బీజేపీ నాయ‌కులు సైలెంట్‌గా ఉండిపోవ‌డం, లేదా ఒక ట్వీట్ చేసి ఊరుకోవ‌డం వైసీసీ నేత‌లు మ‌రింత‌ రెచ్చిపోవ‌డానికి కార‌ణ‌మ‌వుతోంది. తాజాగా బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మితులైన దుగ్గ‌బాటి పురందేశ్వ‌రిపై వైసీపీ ముఖ్య‌నేత‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు ఈ కోవ‌లోకే వ‌స్తాయ‌ని అంటున్నారు. 

బీజేపీలో జాతీయ స్థాయి కీల‌క ప‌ద‌వి చేప‌ట్టిన సంద‌ర్భంగా ఏపీ రాజ‌ధాని విష‌యంలో పార్టీ వైఖ‌రిని పురందేశ్వ‌రి ఇంట‌ర్వ్యూల్లో స్ప‌ష్టం చేశారు. పార్టీ ప‌రంగా రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే ఉండాల‌ని చెబుతున్నామ‌ని, అయితే ఈ విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకోబోద‌ని తెలిపారు. కానీ, ఆమెపై కుల ముద్ర వేస్తూ విజ‌య‌సాయి రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడినా, రాజ‌ధానిగా అమ‌రావ‌తికి అనుకూలంగా మాట్లాడినా... వారిపై కుల ముద్ర వేసేస్తార‌ని వైసీపీపై ఉన్న విమ‌ర్శ‌ల‌కు విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌లు అద్దంప‌డుతున్నాయి. అయితే, ఆయ‌న అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌ను బీజేపీ నాయ‌కులు తేలిగ్గా తీసుకుంటున్నారు.

బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మితులైన పురందేశ్వ‌రి జాతీయ నాయ‌కురాలు కాద‌ని, జాతి నాయ‌కురాల‌ని విజ‌య‌సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఆమె అభిప్రాయాలు చూశాక ఇదే స్ప‌ష్టమైందంటూ నోరుపారేసుకున్నారు. అయితే బీజేపీ నాయ‌కులు కిమ్మ‌నకుండా ఉండిపోయారు. సునీల్ ధియోధ‌ర్ మాత్రం ట్వీట్ చేసి ఊరుకున్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వానికి అనుకూలంగా మాట్లాడ‌ని బీజేపీ నేత‌ల‌ను విజ‌య‌సాయిరెడ్డి వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తుంటారు. బీజేపీలో వైసీపీ అనుకూల గ్రూపును కూడా వ‌దిలిపెట్ట‌డం లేదు. రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజును, బీజేపీని మంత్రి కొడాలి నాని కించ‌ప‌ర‌చినా ప‌ట్టించుకున్న‌వారు లేరు. బీజేపీ నాయ‌కుల‌కున్న ఈ బ‌ల‌హీన‌త‌ను చూసి వైసీపీ మ‌రింత పేట్రేగిపోతోంద‌ని అంటున్నారు. 

కరోనా సోకిందంటే దేవుడిచ్చిన విరామమే.. ఫడ్నవీస్

కరోనా సోకిందంటే దేవుడిచ్చిన విరామమే.. ఫడ్నవీస్

   3 minutes ago


మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   2 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   4 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   4 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   19 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   19 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   a day ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   25-10-2020


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle