విజయనగరం టీడీపీలో వార్.. రెండు వర్గాలుగా చీలిపోయిన తమ్ముళ్లు
16-12-202016-12-2020 11:42:17 IST
Updated On 16-12-2020 11:49:24 ISTUpdated On 16-12-20202020-12-16T06:12:17.758Z16-12-2020 2020-12-16T06:12:13.852Z - 2020-12-16T06:19:24.987Z - 16-12-2020

మొన్న నిప్పు రాజేశారు. ఇప్పుడు పొగలు కక్కుతోంది విజయనగరం పాలిటిక్స్. టీడీపీలో వర్గ పోరు మొదలైంది. మాజీ ఎంపీ అశోక్ గజపతి రాజు.. మాజీ ఎమ్మెల్యే గీత వర్గం మధ్య వార్ ముదిరింది. అశోక్ గజపతి రాజు ఇల్లే టీడీపీ జిల్లా ఆఫీస్ గా నడిచేది. కానీ.. గీత వర్గం మాత్రం ప్రత్యేకంగా టీడీపీ ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఉనికి కోల్పోతుంది పార్టీ ఆఫీస్ ఉండాలి.. గజపతి రాజు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు అంటూ రకరకాల కామెంట్లు చేశారు. ఈ పార్టీ ఆఫీస్ తో మొదలైన రచ్చ ఇప్పుడు పీక్స్ కి వెళ్లింది. గీతకు ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడం వల్లనే.. గజపతి రాజు వర్గంపై అగైనెస్ట్ గా వెళ్తున్నారు అనే టాక్ ఫుల్లుగా ఉంది. పార్టీ ఆఫీస్ అంటేనే.. తిరుగుబాటు లాంటిది అని ఫీల్ అవుతున్నారు గజపతి రాజు వర్గం. ఇక ఆయనపై కామెంట్లు కూడా చేయడంతో.. డివైడ్ అయిపోయింది విజయనగరం టీడీపీ. ఎవరి పాలిటిక్స్ వాళ్లు చేసుకుంటున్నారు. విజయనగరం మాదే అంటే మాదే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లోగా పవర్ పెంచుకోవాలని ఇద్దరి వర్గాలు పట్టు మీదున్నాయి. ఇక గీత కామెంట్స్ ని లైట్ తీసుకోలేదు గజపతి రాజు టీమ్. ఈ విషయంపై అధిష్టానం దగ్గరే తేల్చుకుంటాం అంటున్నారు. ఆమె మీద కంప్లైంట్స్ చేసి.. చర్యలు తీసుకునేలా మూవ్ అవుతున్నారు. అందుకే ఈ ప్రాబ్లమ్ అమరావతి దాకా వచ్చింది. మరి సీనియర్ ని కాదని.. జూనియర్లు ఇలా జెండా ఎగరేస్తే.. అధిష్టానం ఊరుకుంటుందా.. ఈ విషయాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఇప్పుడు విజయనగరం జిల్లాలో.. ముఖ్యంగా టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
an hour ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
an hour ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
3 hours ago

ఆహా.. ఇది అద్భుతమైన ఓపెనింగ్ ఎంపీ సార్
2 hours ago

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
15 hours ago

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
16 hours ago

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
20 hours ago

అధిష్టానంతో అటో ఇటో తేల్చుకుంటాం.. కాంగ్రెస్ అసమ్మతి నేతలు సిద్ధం
a day ago

జగన్ కి పాలన రాదు అనే మాటకి నిదర్శనాలు ఇవేనా
19 hours ago

టీడీపీకి కర్నూలులో మరో పెద్ద నాయకుడు దూరం..!
a day ago
ఇంకా