తేనెతుట్టెని కెలికి నెత్తిన పెట్టుకున్న విజయసాయి!
29-11-202029-11-2020 11:49:25 IST
Updated On 29-11-2020 12:06:56 ISTUpdated On 29-11-20202020-11-29T06:19:25.237Z29-11-2020 2020-11-29T06:19:20.956Z - 2020-11-29T06:36:56.327Z - 29-11-2020

తెర వెనక ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా విజయ సాయి రెడ్డి. ఎందుకింత హడావిడి చేస్తున్నవ్. నీది కాని పనిలో నువ్వెందుకు ఏళ్లూ కాళ్లూ పెడుతున్నవ్. ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చి.. మా విశాఖ ఎయిర్ పోర్టుని మూపిస్తావా. మూసేయ్యాలని లేఖలు రాస్తావా. ఎంత ధైర్యం నీకు. సీఎం జగన్ నీకు సపోర్ట్ ఉంటారనే కదా నువ్విలా చేస్తున్నవ్ అంటూ.. ప్రతి పక్షాలు తిట్టి పోస్తున్నయ్. ఏంటి ఎంపీ సార్.. ఏంటిది.. మన పార్టీ పరిస్థితి ఏం కావాలి. మా ఏరియాలోకి వచ్చి పార్టీలో ఉన్న మా ఇజ్జత్ తీసేలా ఉన్నవ్ కదా. నువ్వు చేసే పనివల్ల మొత్తం పార్టీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. జనంలోకి వెళ్లేది మేము.. విశాఖ ఎయిర్ పోర్ట్ మూసేయ్యాలని ఎందుకంటున్నవ్.. ఒక వేళ మూసినా.. ఇంకా భోగాపురం ఎయిర్ పోర్ట్ కి కొబ్బరి కాయ కూడా కొట్టలేదు. అప్పుడే విశాఖ ఎయిర్ పోర్టు మూసేయాలని లేఖలు ఎందుకు రాస్తున్నవ్ అంటూ.. విశాఖ వైసీపీ లీడర్లు ఘాటుగానే మాట్లాడుతున్నారట. విజయసాయిపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల కడుపుమంట.. ఆడియో లీక్! భోగాపురం ఎయిర్ పోర్టు కడితే.. దాని డెవలప్ మెంట్ కోసం.. 30 ఏళ్లు విశాఖ ఎయిర్ పోర్టుని మూసేయాలని రాసిన లేఖతో ఇంతదాకా వచ్చింది. యాక్చువల్ గా భోగాపురం ఎయిర్ పోర్టు ఇంకా స్టార్ట్ కాలేదు. అది పూర్తైన తర్వాత విశాఖ ఎయిర్ పోర్టుని మూసేయాలని గతంలో ఏవో ప్రతి పాదనలు ఉన్నాయట. అది స్టార్ట్ కాక ముందే విజయ సాయి దాని గురించి లేఖ రాయడం.. సెంట్రల్ మినిస్టర్ దాన్ని బయటపెట్టడంతో ఇష్యూ ఇంత దాకా వచ్చింది. అయినా.. విశాఖ ఎయిర్ పోర్ట్ సిటీలో ఉంది. భోగాపురం సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతో జనాలకి ఇబ్బంది తప్పదు. అందుకే దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా ఉంచి.. దీన్ని డొమెస్టిక్ గా నడపాలని.. రెండూ కావాలని విశాఖ జనాలు డిమాండ్ చేస్తున్నారు. ఎవరికో లాభం కలగడానికి తెర వెనక ఒప్పందాలు చేసుకుని.. విజయసాయి ఇలా చేస్తున్నారు అనే కామెంట్స్ బానే వినిపిస్తున్నయ్. మరి ఈ విషయం ఎంత దాకా వెళ్తుందో చూడాలి.

ఎన్నికలకు సహకరిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం..!
42 minutes ago

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్.. షాక్ లో ప్రతిపక్షాలు
18 minutes ago

రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్
2 hours ago

జగన్ సర్కార్ కి మరో దెబ్బ.. ఎన్నికలు జరపాలని చెప్పిన హై కోర్టు
2 hours ago

రేవంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి.. జానారెడ్డి గెలుపుకి బాధ్యులు అవుతారా?
an hour ago

బెదిరింపులకు ఆయుధంగా మారిన అట్రాసిటీ కేసులు.. హైకోర్టు అక్షింతలు
2 hours ago

భారతీ సిమెంట్ మీద మమకారం.. వందల కోట్ల ప్రభుత్వ నిధుల చెల్లింపు
3 hours ago

ఆ ఒక్క మాట.. రెండు కులాల మధ్య చిచ్చు.. ప్రభుత్వానికి తప్పని చికాకు
4 hours ago

పల్నాడులో టీడీపీ నేత అంకులును చంపింది వీరే
5 hours ago

విడుదలైన కళా వెంకట్రావు
5 hours ago
ఇంకా