newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి

03-03-202103-03-2021 14:25:58 IST
Updated On 03-03-2021 16:38:41 ISTUpdated On 03-03-20212021-03-03T08:55:58.619Z03-03-2021 2021-03-03T08:53:20.227Z - 2021-03-03T11:08:41.949Z - 03-03-2021

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు తెలుగుదేశం పార్టీకి దూరమై చాలా రోజులే అవుతోంది. గంటా శ్రీనివాస రావు వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది. కానీ ఏవో కొన్ని కారణాల వలన గంటా ఇటు వైపు దూకట్లేదనే అంటున్నారు. గంటా కూడా వైసీపీ కండువా కప్పుకుంటే వైజాగ్ ప్రాంతంలో టీడీపీకి బలమైన నాయకులంటూ లేకుండా పోతారనే టాక్ నడుస్తూ ఉంది. అందుకే వైసీపీ కూడా టీడీపీని దెబ్బ కొట్టాలంటే గంటా శ్రీనివాసరావును పార్టీలోకి చేర్చుకోవాలని అనుకుంటూ ఉంది. దీనికి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే ప్రచారం నడుస్తూ ఉంది. ఇక గంటా వైసీపీ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఆయన అనుచరులను వైసీపీలోకి పంపుతూ ఉన్నట్లు తెలుస్తోంది. 

తాజాగా గంటా శ్రీనివాసరావు అనుచ‌రుడు, టీడీపీ నేత కాశీ విశ్వ‌నాథ్ విశాఖపట్నంలో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో పాటు ప‌లువురి స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. ఆయ‌న‌ను కండువా క‌ప్పి పార్టీలోకి  విజ‌య‌సాయిరెడ్డి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి అవంతి శ్రీనివాస్ హాజ‌రు కాక‌పోవ‌డం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ... ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా కొన‌సాగుతోన్న సీఎం వైఎస్‌ జ‌గ‌న్ పాల‌న చూసే చాలా మంది వైసీపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. సంవత్సరం క్రితమే కాశీ పార్టీలో చేరాల్సింది. కొన్ని కారణాలు వలన అవ్వలేదు.

జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులందరు కాశిని పార్టిలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసుకొని జీవిఎంసి ఎన్నికల్లో విజయం సాధించాలని విజయసాయి రెడ్డి అన్నారు. గంటా శ్రీనివాస‌రావు త‌మ‌కు కొన్ని ప్రతిపాద‌న‌లు పంపారని విజయసాయి రెడ్డి చెప్పారు. వైఎస్ జ‌గ‌న్ ఆమోదం త‌ర్వాత గంటా శ్రీనివాస‌రావు వైసీపీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. గంటా శ్రీనివాస‌రావు వీలైనంత త్వరలోనే వైసీపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ఆకర్షితుడునై వైఎస్సార్‌ సీపీలో చేరానని కాశీ విశ్వనాథ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని.. జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ గెలుపే దిశగా  చిత్తశుద్ధితో పని చేస్తానని చెప్పుకొచ్చారు. 

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ..నెల్లూరులో ట‌గ్గాఫ్ వార్

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   15 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   14 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   18 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   21 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle