newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

20-10-202020-10-2020 17:41:50 IST
Updated On 20-10-2020 17:49:38 ISTUpdated On 20-10-20202020-10-20T12:11:50.910Z20-10-2020 2020-10-20T12:11:41.398Z - 2020-10-20T12:19:38.166Z - 20-10-2020

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గుంటూరు ఘాటు రాజ‌కీయాలు ఇప్పుడు ఇంకా సీరియ‌స్ గా ఉన్నాయి. ఓ ప‌క్క వ‌ర‌ద‌లొచ్చి ర‌చ్చ ర‌చ్చ‌గా ఉన్నా పాలిటిక్స్ లో మాత్రం హీట్ త‌గ్గ‌డం లేదు. విడ‌ద‌ల రజ‌నీ వ‌ర్సెస్ సీనియ‌ర్ నేత‌లుగా న‌డుస్తోంది అక్క‌డ‌. అప్ప‌ట్లో వేరే పార్టీలో ఉండి జ‌గ‌న్ ని నానా మాట‌లు అన్న విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఇస్తారా అంటూ చాలా మాట‌లే ఉన్నా.. పెద్ద‌గా సీనియార్టీ లేకున్నా.. విడ‌ద‌ల ర‌జ‌నీకి మాత్రం మంది పద‌వి ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

యాక్చువ‌ల్ గా అయితే.. సీనియ‌ర్ల‌కే ఇవ్వాల్సి ఉన్నా.. విడ‌ద‌ల ర‌జ‌నీకి లేడీ కోటా క‌లిసొస్తోంద‌ట‌. ఇక బీసీ లీడ‌ర్ కావ‌డం కూడా అమెకి క‌లిసొచ్చిన అంశ‌మే. ఇక పోతే.. ఆమెకు మీడియాలో కూడా ఫుల్లు పాపులారిటీ ఉంది. దీంతో జ‌నంలోకి వెళ్లింది ఆమె క్రేజ్. వైసీపీ లీడ‌ర్స్ అన‌గానే స్టేట్ మొత్తం ఆమె గుర్తొస్తారు. ఆ మ‌ధ్య లాక్ డౌన్ లో ఆమె మూవింగ్స్ చాలా పాపులారిటీ తెచ్చిపెట్టాయి.

క‌రోనా టైమ్ లో జ‌నంలోకి వెళ్ల‌డంతో అంద‌రూ గుర్తించారు. సో.. లోక‌ల్ గా లీడ‌ర్ గా ఉన్న విడ‌ద‌ల ర‌జ‌నీ.. స్టేట్ లీడ‌ర్ గా మారిపోయారు. ఇక మినిస్ట్రీలో కూడా లేడీస్ సంఖ్య ఎంత ఉంటే అంత బావుంటుంది. సో.. విడ‌ద‌ల ర‌జ‌నీకి మినిస్ట్రీ ఖాయం అని.. ఆమె వ‌ర్గం లీడ‌ర్లు.. కార్య‌క‌ర్త‌లు ఫుల్లు క్లారిటీగా ఉన్నార‌ట‌. అదే పార్టీలో ఉన్న అపొనెంట్ వ‌ర్గం.. ఆమె మంత్రి ప‌ద‌వి ఆప‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ర‌జ‌నీకే మంత్రి ప‌ద‌వి ఖాయం అవుతుంది అనే టాక్ న‌డుస్తోంది. మ‌స్కా మూవీని మ‌రిపించే గుంటూరు పాలిటిక్స్

అయితే.. ఇప్పుడ‌ప్పుడే మంత్రి ప‌ద‌వులు రావ‌డం కానీ.. తీసి వేయ‌డం కానీ.. వైసీపీలో జ‌రిగే ఛాన్స్ లేదు. ఏ మినిస్ట‌ర్ పైనా వేటు ప‌డుతుంది అనే టాక్ కూడా లేదు. కాక‌పోతే.. మినిస్ట్రీలు రాత్రికి రాత్రే ఫిక్స్ అయ్యేవి కావు. రెండున్న‌రేళ్ల త‌ర్వాత మినిస్ట‌ర్ లు మార‌తారు అనే విష‌యంపై అంద‌రూ క్లియ‌ర్ గా ఉన్నారు. జ‌గ‌న్ అంటే వెన‌క్కి త‌గ్గ‌రు కాబ‌ట్టి.. స‌గం మందికి అయినా కొత్త మంత్రుల‌కి ఛాన్స్ దొరుకుతుంది అని అంద‌రూ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వ‌ర‌ద‌ల టైం కాబ‌ట్టి ఇంకా ప్ర‌జ‌ల్లోకి వెళ్లి.. మంచి పేరు తెచ్చుకుని.. త‌మ‌కి మంత్రి ప‌ద‌వి ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు అనే ఫీల్ క్రియేట్ చేయాలి అని చూస్తున్నార‌ట లీడ‌ర్లు. మంత్రి ప‌ద‌వులు కొత్త‌గా ఇస్తే మాత్రం విడ‌ద‌ల ర‌జీనికి క‌చ్చితంగా సీటు క‌న్ఫామ్ అనే టాక్ ఉంది. మ‌రి ర‌జ‌నీకి ఏమైనా పైనుంచి భ‌రోసా దొరికిందా అనే విష‌యంపై క్లారిటీ లేదు. బ‌ట్.. అరుగుల మీద జ‌రిగే డిస్క‌ష‌న్స్ లో వైసీపీ వ‌ర్గాల్లో మాత్రం క‌న్ఫామ్ అనే టాక్ న‌డుస్తోంది. చూడాలి..లిస్ట్ ఫైన‌ల్ ఎప్పుడు అవుతుందో. 

 

రైతుల అన్ని డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతుల హర్షం

రైతుల అన్ని డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతుల హర్షం

   an hour ago


ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

   6 hours ago


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

   8 hours ago


టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

   10 hours ago


ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

   21 hours ago


ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

   a day ago


తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

   06-12-2021


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

   06-12-2021


భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

   06-12-2021


రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

   04-12-2021


ఇంకా

Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle