newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

19-10-202019-10-2020 16:29:23 IST
Updated On 19-10-2020 16:39:50 ISTUpdated On 19-10-20202020-10-19T10:59:23.394Z19-10-2020 2020-10-19T10:59:11.732Z - 2020-10-19T11:09:50.371Z - 19-10-2020

వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ప‌రిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యారైంద‌ట‌. టీడీపీలో కొన‌సాగినంత కాలం ఎదురులేని రాజ‌కీయాలు నెర‌పిన ఆయ‌న‌ ఇప్పుడు ఢీలా ప‌డిపోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక రాజ‌కీయాల్లో మ‌నం మ‌నుగ‌డ సాగించ‌లేమ‌నే స్థాయిలో వంశీ నిరుత్సాహ ప‌డిపోయిన‌ట్లు నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ సాగుతుంది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పును ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ.. ఇటీవ‌లి కాలంలో ఆ పార్టీని వీడి వైసీపీ మ‌ద్ద‌తు దారుడిగా కొన‌సాగుతున్నాడు. అయితే వైసీపీలో వంశీకి సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆశీస్సులు ఉన్న‌ప్ప‌టికీ స్థానిక రాజ‌కీయాలతో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు తెలుస్తోంది. 

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వంశీ చేతిలో వైసీపీ అభ్య‌ర్థిగా యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు స్వ‌ల్ప ఓట్ల మెజార్టీతో ఓట‌మిపాల‌య్యాడు. అప్ప‌టి నుండి ఆయ‌నే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా కొన‌సాగుతున్నారు. అయితే వంశీ టీడీపీని వీడి వైసీపీ మ‌ద్ద‌తుదారుడిగా ఉండ‌టంతో యార్ల‌గ‌డ్డ వర్గానికి రుచించ‌డం లేదు. దీనికితోడు అదే పార్టీలో ఉన్న దుట్టా రామ‌చంద్ర‌రావు వ‌ర్గీయులుసైతం వంశీ వైసీపీలోకి రాక‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. దీంతో ఆ రెండు వ‌ర్గాల నుంచి ఎదుర‌వుతున్న స‌వాళ్లతో వంశీ ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు  తెలుస్తోంది. ఇటీవ‌ల ఇలాంటి రాజ‌కీయాల్లో తాను మ‌నుగడ సాగించ‌లేన‌ని, రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని త‌న వ‌ర్గీయుల వ‌ద్ద వంశీ వాపోయిన‌ట్లు వార్త‌లు సైతం గుప్పుమ‌న్నాయి. 

కొద్దిరోజుల‌కే వీరి మ‌ధ్య జ‌గ‌న్ స‌యోధ్య కుదిర్చిన‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. కానీ ఇప్ప‌టికీ యార్ల‌గ‌డ్డ‌, వంశీ, దుట్టా వ‌ర్గాలుగా గ‌న్న‌వ‌రం వైసీపీలో రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. ఎవ‌రికివారే త‌మ‌త‌మ ఆధిప‌త్యాల‌ను కొన‌సాగించేందుకు వ్యూహాల‌తో ముందుకెళ్తున్నారు. ఈ ప‌రిస్థితి నుండి బ‌య‌ట‌ప‌డేందుకు, మ‌ళ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఏక‌చ‌క్రాధిప‌త్యం కొన‌సాగించేందుకు వంశీకి ఆయ‌న అనుచ‌రులు కొత్త స‌ల‌హా ఇస్తున్నారంట‌. ఇప్పుడు మ‌ళ్లీ టీడీపీలోకి తిరిగి వెళ్ల‌డం సాధ్యం కాద‌ని, అలా అని వైసీపీలో ఉండి త‌మ బ‌లాన్ని నిరూపించుకోవ‌టం కూడా సాధ్య‌మ‌య్యే ప‌నికాద‌ని వంశీకి ఆయ‌న అనుచ‌రులు హిత‌బోద చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. 

ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌ను వీడ‌టం కంటే వ‌ర్గాన్ని కాపాడుకొనేందుకు, ఆధిప‌త్యాన్ని కొన‌సాగించేందుకు బీజేపీలోకి వెళితే బాగుంటుంద‌ని ప‌లువురు వంశీకి స‌ల‌హాలు ఇస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే బీజేపీలో ఉన్న సుజ‌నాచౌద‌రితో పాటు ప‌లువురు బీజేపీ పెద్ద‌ల‌తో వంశీకి స‌త్సంబంధాలు ఉన్నాయి. వీరి ద్వారా బీజేపీలోకి వెళ్లి నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ వ‌ర్గీయుల‌ను కాపాడుకుంటే బాగుంటుంద‌ని వంశీకి ఆయన అనుచరులు స‌ల‌హాలు ఇస్తున్నారంట‌. మ‌రి వంశీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాల్సిందే మ‌రి.

వల్ల‌భ‌నేని వంశీ కీల‌క నిర్ణ‌యం..! ఆనందంలో టీడీపీ శ్రేణులు..!!

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

   7 hours ago


పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

   7 hours ago


ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

   8 hours ago


పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

   9 hours ago


అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

   9 hours ago


ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

   9 hours ago


పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

   10 hours ago


ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

   10 hours ago


వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

   11 hours ago


ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

   11 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle