newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

13-05-202113-05-2021 07:58:05 IST
2021-05-13T02:28:05.892Z13-05-2021 2021-05-13T02:27:58.815Z - - 14-06-2021

రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్ రోగులు మృత్యువాత పడ్డారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతూ ఉంది. దీనిపై నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బాధిత బంధువులను కూడా ఆసుపత్రి నుంచి పంపించివేశారు.  మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వాలని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 

తిరుపతిలోని రుయా ఆసుపత్రి మృతులు 11 మంది కాదని, వాస్తవ మృతుల సంఖ్య 31 మందని టీడీపీ చెబుతోంది.  ప్రభుత్వం 11 మందే చనిపోయారని ప్రకటించి ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని, సీఎం తప్పిదం వల్ల చనిపోతున్న ప్రతి బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని రామానాయుడు డిమాండ్ చేశారు. 31 మంది మాత్రమే కాక మరో 10 నుంచి 15 మంది వరకు చనిపోయి ఉంటారని, వారి వివరాలు కూడా సేకరిస్తున్నట్టు చెప్పారు. 

 రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారి పేర్లు, వయసు, చిరునామా తదితర వివరాలను మీడియాకు చెప్పారు. రుయా మృతుల విషయంలో సీఎం, మంత్రులు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆసుపత్రిలో 5 నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందని కొందరంటే.. మరికొందరు 35 నిమిషాలు 40 నిమిషాలు అంటున్నారని అన్నారు. నిజాలు తెలుసుకోడానికి  సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

మొత్తం 11 మంది చనిపోయినట్టు ప్రభుత్వం చెపుతున్నా ఈ లెక్కలు కరెక్ట్ కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మృతుల విషయంలో ప్రభుత్వం అసత్యాలు చెపుతోందని.. మొత్తం 23 మంది చనిపోయారని అన్నారు. చనిపోయిన వారి పేర్లను కూడా ఆయన వెల్లడించారు. రమేశ్ బాబు, రామారావు, జయచంద్ర, కె.బాలు, భువనేశ్వర్ బాబు, రమణాచారి, కలందర్, గజేంద్రబాబు, షాహిద్, మహేంద్ర, ప్రభాకర్, పుష్పలత, గౌడ్ బాషా, వేణుగోపాల్, మదన్మోహన్ రెడ్డి, దేవేంద్రరెడ్డి, రాజమ్మ, సుబ్రహ్మణ్యం, సులోచన, తనూజారాణి, వెంకట సుబ్బయ్య, పజులాల్, రామారావు అనే వ్యక్తులు చనిపోయారని ఆయన చెప్పారు. మృతుల సంఖ్యపై వైసీపీ ప్రభుత్వం వాస్తవాలను చెప్పడం లేదని నారాయణ మండిపడ్డారు. ఆక్సిజన్ ట్యాంకర్లను రెండ్రోజుల ముందే తెప్పించుకోవాలనే విషయం ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలకు కూడా వైసీపీ నేతలు కులాలను ఆపాదిస్తున్నారని చెప్పారు. కేంద్రాన్ని నిలదీయడం చేతకాక... ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   4 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   6 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   8 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   8 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   9 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   9 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   10 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   10 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle