newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

17-04-202117-04-2021 12:19:04 IST
Updated On 17-04-2021 12:28:02 ISTUpdated On 17-04-20212021-04-17T06:49:04.730Z17-04-2021 2021-04-17T06:49:01.161Z - 2021-04-17T06:58:02.324Z - 17-04-2021

తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను వైసీపీ పెద్ద సంఖ్యలో తిరుపతికి రప్పించిందంటూ టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతికి ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాల్లో దొంగ ఓటర్లను తరలిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెనడీ నగర్, లక్ష్మీపురం కూడలి వద్ద దొంగ ఓటర్లను తీసుకొస్తున్న బస్సులను ఆపి, రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ బూత్ లకు వచ్చిన దొంగ ఓటర్లను కూడా అడ్డుకున్నారు. వారి నుంచి నకిలీ ఓటరు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో వందలాది మంది దొంగ ఓటర్లను నిన్ననే తీసుకొచ్చి పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారంతా అక్కడి నుంచి తప్పించుకున్నారని తెలిపారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో పెద్ద ఎత్తున అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. వీడియోను పోస్ట్ చేస్తూ వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమ‌ర్శ‌లు చేశారు.

'పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ పెద్దిరెడ్డి.. ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను న‌రికేస్తున్న‌ట్టే ప్ర‌జాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నాడు. తిరుపతి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి బ‌య‌టి నుంచి త‌న ముఠాల‌ను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నాడు' అని ఆరోపించారు.

'పెద్దిరెడ్డి మ‌నుషులు 5 వేల మంది పెద్దిరెడ్డికే చెందిన పీఎల్ఆర్ క‌ల్యాణ మండపంలో మ‌కాం వేసి దొంగ ఓట్లు వేయ‌డానికి వెళ్తుంటే టీడీపీ నాయ‌కులు అడ్డుకున్నారు. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన పంచాయ‌తీ, మున్సిప‌ల్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పోలీసులు అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఎల‌క్ష‌న్ జ‌ర‌గ‌కుండా సెల‌క్ష‌న్ చేయించుకున్న మంత్రి పెద్దిరెడ్డి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న తిరుపతి ఎన్నిక‌ని అక్ర‌మార్గంలో గెల‌వాల‌ని నేరుగా తానే రంగంలోకి దిగారు' అని లోకేశ్ చెప్పారు.

'తిరుప‌తి ఉప‌ఎన్నిక‌లో రిగ్గింగ్‌, దొంగ ఓట్ల‌తో నెగ్గాల‌ని వేసిన ప్ర‌ణాళిక‌ని తెలుగుదేశం బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. ఇప్ప‌టికైనా కేంద్ర ఎన్నిక‌‌ల క‌మిష‌న్ స్పందించి పెద్దిరెడ్డి, వైసీపీ మంత్రుల్ని అదుపులోకి తీసుకోవాలి. దొంగ ఓట్లు వేసేందుకు ఇత‌ర ప్రాంతాల త‌ర‌లివ‌చ్చిన వేలాది మందిని అరెస్ట్‌చేసి సూత్ర‌ధారులపై చ‌ర్య‌లు తీసుకోవాలి' అని లోకేశ్ కోరుతున్నారు. 

చంద్రబాబు మీద దాడి.. పక్కా ప్లాన్ తోనే చేశారా..?

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   11 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle