newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

17-04-202117-04-2021 12:46:18 IST
Updated On 17-04-2021 13:00:19 ISTUpdated On 17-04-20212021-04-17T07:16:18.551Z17-04-2021 2021-04-17T07:16:12.971Z - 2021-04-17T07:30:19.075Z - 17-04-2021

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్ నమోదైంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ మైన భద్రత ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో పలుచోట్ల పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలు మోరాయించడంతో వాకాడు, నిడిగుర్తి, పొద‌ల‌కూరు, నాయుడుపేట‌ల్లో  పోలింగ్ ఆలస్యమైంది. గూడూరులోని 47,48,49 కేంద్రాల్లోని సాంకేతిక లోపంతో ఈవీఎంలు మొరాయించాయి. 

ఓటర్లతో పోలింగ్‌బూత్‌ వద్ద క్యూ లైన్లు పెరుగుతున్నాయి. ఎన్నికల ఏర్పాట్లు విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల పరిధిలో సర్వేపల్లి  నియోజకవర్గం నుంచి ఎక్కువ పోలింగ్ శాతం నమోదైందని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. అగ్రహారం పుత్తూరులో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాదలూరులో కిలివేటి సంజీవయ్య ఓటు వేశారు. 

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలంలోని అర‌వ‌పాళెం పోలింగ్ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నిక‌ల విధుల్లో ఉన్న ఏపీవో ఏంబేటి ర‌వి మృతి చెందారు. చాతిలో నొప్పి రావడంతో పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన తోటి అధికారులు ఆస్పత్రి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. సూళ్లూరుపేట మండంలోని నూకలపాలెంలో ఉపాధ్యాయుడిగా రవి విధులు నిర్వహిస్తున్నారు. 

డాక్టర్‌ గురుమూర్తి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉండగా.. టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్‌ రత్నప్రభ, కాంగ్రెస్‌ నుంచి చింతా మోహన్‌, సీపీఎం తరఫున నెల్లూరు యాదగిరి సహా మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సత్యవేడు  పోలింగ్‌ కేంద్రాన్ని ఎస్పీ సెందిల్‌కుమార్‌ పరిశీలించారు. ఉప ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేశామని..  ప్రతి మండలానికి ఒక డిఎస్పీ, 4 సీఐలు, 8 మంది ఎస్‌ఐలతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   4 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   15 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle