newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

16-04-202116-04-2021 08:37:28 IST
Updated On 16-04-2021 09:23:54 ISTUpdated On 16-04-20212021-04-16T03:07:28.713Z16-04-2021 2021-04-16T03:07:24.959Z - 2021-04-16T03:53:54.640Z - 16-04-2021

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అత్తారింటికి దారేది సినిమా క్లైమ్యాక్స్ లో నాకీ స్టేష‌న్ కావాలి.. ఈ పావుగంట చాలా ఇంపార్టెంట్ అంటాడు క‌దా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్. మ‌రి ఇవ్వాళ తిరుప‌తిలో ఇవ్వాళ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుందో లేదో. అక్క‌డ స్టేష‌న్ ని ఖాళీ చేయించిన‌ట్లు.. ఇక్క‌డేం చేస్తారు అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ పాయింట్. అస‌లు.. ల‌క్ష్మీదేవి క‌టాక్షం విష‌యంలో ప‌వ‌న్ ప‌వ‌ర్ ఎంత‌.. అస‌లు అంత సీనుందా లేదా.. అస‌లు తిరుప‌తి విష‌యం ప‌ట్టించుకుంటున్నాడా  లేదా అన్న‌ది.. కీ పాయింట్.

అయితే.. జ‌న‌సేన‌, బీజేపీ ఎవ్వారం అలా వ‌దిలేస్తే.. మ‌రో రెండు పార్టీలు మాత్రం మంచి ప‌ట్టుమీదున్న‌య్. అవే టీడీపీ, వైసీపీ. ఈ ఒక్క‌రోజుని ఈ పార్టీలు ఎలా యూజ్ చేసుకోబోతున్నాయి అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ పాయింట్. ఎందుకంటే.. బీజేపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్ ల గురించి జ‌నం కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. కేవ‌లం  వైసీపీ, టీడీపీ మ‌ధ్య‌నే పోటీ ఉంది. అయితే.. ల‌క్ష్మీ దేవి క‌టాక్షం ఇవ్వాళ తిరుప‌తిలో వెంక‌న్న క‌టాక్షం కంటే ఎక్కువ‌గా ఉంటుంది అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే క‌దా. 

ముఖ్యంగా అధికార పార్టీ ల‌క్ష్మీదేవి అమ్మ‌వారు ఎంత వైభ‌వంగా విర‌జిల్లుతారు అనే పాయింట్ పై ఎక్కువ ఇంట్ర‌స్ట్ క‌లుగుతోంది.  ఓటుకి నోటు కామ‌న్. ఆ విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఒక్క నోటా రెండు నోట్లా.. నాలుగైదు నోట్లా.. అలాగే ఆ నోటు ఏ నోటు.. ఎర్ర నోటా.. బ్రౌన్ నోటా.. వేరే నోటా. నోటాకి నొక్క కుండా ఉండాలంటే నోటు ఇవ్వాల్సిందే అంటూ చాలా మంది డిమాండ్ చేస్తారు. ఓట‌ర్ కూడా తెలివి మీరాడు క‌దా.

ముఖ్యంగా అధికార పార్టీని ఎక్క‌వ డిమాండ్ చేస్తారు. అందుకే.. ఇవ్వాళ ఎవ‌రు ఎక్క‌డ ఎంత  పంచుతున్నారు అనేది హాట్ న్యూస్ గా మారింది తిరుప‌తిలో. ఆల్రెడీ ఓటుకి రెండు వేలు అనే టాక్ ఉంది. మ‌రి ఫైన‌ల్ గా ఎంత ఫిక్స్ అవుతుందో.. ఎక్క‌డెక్క‌డ ఎంతెంత పంచారో.. అన‌ఫిషియ‌ల్ లెక్క‌లు రావాలంటే.. రెండు రోజులు ఆగాల్సిందే. త‌క్కువ‌లో త‌క్కువ‌.. రెండొంద‌ల కోట్ల నోట్ల క‌ట్ట‌ల‌పై ల‌క్ష్మీదేవి  అమ్మ వారు ఆశీర్వ‌దిస్తారు అని తెలుస్తోంది.


Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle