newssting
Radio
BITING NEWS :
కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకున్న అమ్మాజీ స్వాజీ. డబ్బుల కోసం అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్. షిరిడీ వెళ్దామని చెప్పి స్వామీజీని కిడ్నాప్ చేసి, 20 కోట్ల రూపాయలు - కిలో బంగారం డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. ఇంతలో గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి డాక్టర్ల ద్వారా పోలీసులకు కిడ్నాప్ గురించి సమాచారం. * ప్రొద్దుటూరులో ఉన్మాది దాడిలో గాయపడిన లావణ్యకు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి ప్రొద్దుటూరు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలింపు. నిందితుడు సునీల్ దాడిలో లావణ్య తల, చేతికి తీవ్రగాయాలు. ప్రస్తుతం లావణ్య ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. * టీటీడీ నుంచి రామతీర్థానికి విగ్రహాల తరలింపు. రామతీర్థం ఆలయాన్ని పునర్నించాలని నిర్ణయించిన ప్రభుత్వం. ఆలయ పనులు పూర్తయ్యేంతవరకూ బాలాలయంలోనే విగ్రహాల ప్రతిష్ట. ఏడాదిలోగా రామతీర్థానికి పూర్వవైభవం తీసుకొస్తామన్న మంత్రి వెల్లంపల్లి. * విషమించిన ఆర్జేడీ నేత లాలూప్రసాద్ ఆరోగ్యం. రాంచీ రిమ్స్ ఆస్పత్రిలో లాలూకు కొనసాగుతున్న చికిత్స. లాలూ ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటున్న వైద్యులు. * పాట్నాలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు. అగ్నిప్రమాద స్థలానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళనలో స్థానికులు. * తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ లో రూ.7 కోట్ల విలువైన బంగారం అపహరణ. హైదరాబాద్ లో దొరికిన బంగారం దొంగలు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ఎదుట నిందితులను హాజరుపరచనున్న పోలీసులు. * పశ్చిమగోదావరి జిల్లా కొమిరేపల్లిలో 28కి చేరిన వింతవ్యాధి కేసులు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో 19 మంది డిశ్చార్జ్. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 9 మంది బాధితులు. పూళ్లలో 36కి చేరిన వింతవ్యాధి కేసులు. ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది. * అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం. ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడి. చిన్నారికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. * ఏపీ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణ. ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు, 31న ఉపసంహరణ. ఫిబ్రవరి 5న పోలింగ్.

తిరుపతి బైపోల్.. అభ్యర్ధి మార్పు తధ్యం?

14-01-202114-01-2021 08:03:50 IST
2021-01-14T02:33:50.577Z14-01-2021 2021-01-14T02:33:45.682Z - - 24-01-2021

తిరుపతి బైపోల్.. అభ్యర్ధి మార్పు తధ్యం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తిరుప‌తి బై పోల్ ఇప్పుడు ఏపీలో ప్ర‌తిష్టాత్మకంగా మారింది. ప్ర‌తి పార్టీ కూడా ప్ర‌స్టీజియ‌స్ గా తీసుకుంది. ముందుగా టీడీపీ నే ఒక అడుగు స్పీడ్ మీదుంది. అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న నుంచి.. ప్లానింగ్ తో పాటూ అన్నీటిలోనూ దూసుకెళ్తోంది. ఇటు బీజేపీ చేప‌డుతున్న యాత్ర‌.. జ‌న‌సేనతో ఉన్న దోస్తీ వ‌ల్ల‌.. అటు కూడా స్ట్రాంగ్ గానే ఉంది. సో.. అధికార పార్టీ అయినా.. సిట్టింగ్ సీటు అయినా.. వైసీపీకి కాస్త క‌ష్ట‌మే. తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ చ‌నిపోవ‌డంతో అక్క‌డ ఎల‌క్ష‌న్ జ‌ర‌గ‌బోతుంది. ఆయ‌న చ‌నిపోయి మార్చికి ఆరు నెల‌లు అవుతుంది కాబ‌ట్టి.. ఈనెల చివ‌రిలోగా నోటిఫికేషన్ వ‌స్తుంది.. ఆరు నెల‌లు పూర్త‌య్యేలోగా ఎన్నిక‌లు జ‌రుగుతాయి కాబ‌ట్టి.. పార్టీల‌న్నీ తిరుప‌తి సీటు పై ఫోక‌స్ చేశాయి. 

ఇక వైసీపీ అభ్య‌ర్థి విష‌యంలో కూడా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. ఫిజియోల‌జిస్టు గురుమూర్తి నుంచుంటారు అనే క్లారిటీ ఉన్నా.. అభ్య‌ర్థిని మారుస్తారు అనే క‌న్ ఫ్యూజ‌న్ కూడా ఉంది. అయితే ఈ క‌న్ ఫ్యూజ‌న్ పై ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. సీఎం జ‌గ‌న్ బ‌య‌టికొచ్చి.. ఈయ‌నే వైసీపీ అభ్య‌ర్థి అనే వ‌ర‌కూ నో క్లారిటీస్. అన్నా కూడా మారుస్తారేమో అనే డౌట్స్ ఉన్న‌య్. ఎందుకంటే.. తిరుప‌తి రాకీయాలు రోజుకో ర‌కంగా మారుతున్నాయి. బ‌ల‌మైన రాజ‌కీయ క్యాడ‌ర్ ఉన్న లీడ‌ర్ కాకుంటే.. అక్క‌డ గెల‌వ‌డం క‌ష్ట‌మే అన్న‌ట్లుంది ఎవ్వారం. ఎంపీ నియోజ‌క వ‌ర్గంలోని ఏడు ఎమ్మెల్యే సెగ్మెంట్ల‌లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త గెలుపుని డిసైడ్ చేసి.. వైసీపీ అభ్య‌ర్థి ఓటమి పాలయ్యే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. అందుకే.. వైసీపీ కూడా అభ్య‌ర్థి విష‌యంలో ఇంకా క్లారిటీకి రావ‌డం లేద‌ట‌. 

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఉంటాయి అనుకున్నా.. మొత్త షెడ్యూల్ వ‌చ్చినా.. అది ఆగిపోవ‌డంతో.. అంద‌రూ అన్ని పార్టీలూ ఎంపీ ఎన్నిక‌ల‌పైనే ఫోక‌స్ చేశాయి. ఈ ఒక్క సీటులో గానీ.. వైసీపీ ఓడిపోతే.. ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌కు ఇది ఎగ్జాంపుల్ గా మారిపోతుంది. అందుకే.. వైసీపీ కూడా ఈ సీటుని ప్ర‌స్టీజియ‌స్ గానే తీసుకుంది.

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

   3 hours ago


నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

   8 hours ago


తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

   10 hours ago


అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

   8 hours ago


ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

   10 hours ago


అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

   6 hours ago


వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

   4 hours ago


లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

   12 hours ago


ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

   11 hours ago


ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

   9 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle