newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

19-04-202119-04-2021 08:00:33 IST
2021-04-19T02:30:33.629Z19-04-2021 2021-04-19T02:30:06.396Z - - 15-05-2021

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అవును. మాట‌లేనా చెప్పండి. మాట‌లు అన‌డం సైలెంట్ గా ఉండ‌డం. అంతేనా. మ‌రి తెలంగాణ మినిస్ట‌ర్.. ఏపీ విశాఖ ఉక్కు కోసం పోరాడేది ఎప్పుడు. ఉద్య‌మం నీరు గారి పోయిన త‌ర్వాత‌నా. విశాఖ ఉక్కును మ‌ళ్లీ ఆంధ్రులు త‌మ హ‌క్కుగా కొట్లాడి ద‌క్కించుకున్న త‌ర్వాత‌నా. అంటే లాస్ట్ లో వ‌చ్చి.. మా వ‌ల్లే వ‌చ్చింది అని చెప్పుకుంటారా. పోరాడాలంటే నిజాయితీగా ముందుకు రావాలి క‌దా. మ‌రి వ‌చ్చేదేదో వ‌చ్చేస్తే అయిపోతుంది క‌దా.

ఇలాంటి టాక్ మొద‌లైంది. ఆంధ్ర తెలంగాణ రెండు చోట్లా ఇదే మాట అంటున్నారు. ప్ర‌త్య‌క్షంగా పోరాటంలోకి దిగుతాం అన్న కేటీఆర్.. దిగాలి క‌దా అంటున్నారు. ఇప్పుడు అస‌లు సిస‌లు టైం వ‌చ్చింది అని కూడా అంటున్నారు. ఓ ప‌క్క క‌రోనా.. మ‌రో ప‌క్క ఎల‌క్ష‌న్ల హ‌డావిడితో.. విశాఖ ఉక్కు ఉద్య‌మాన్ని జ‌నాలు మ‌ర్చిపోయారు.  ఫోక‌స్ కూడా రావ‌డం లేదు. మ‌రి కేంద్రం దాకా తెలియాలి క‌దా. అయినా స‌రే.. కేంద్రం దాకా తెలియ‌డం లేదు. కేంద్రం దాకా పోని ఉద్య‌మంతో పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌దు. అఫ్ కోర్స్.. స్థానికంగా కేంద్రం ఎవ్వారాన్ని ఎండ‌గ‌ట్టొచ్చు. కానీ.. విశాఖ ఉద్య‌మం బ‌ల‌మేంటో తెలియాలి అంటే.. ప‌బ్లిసిటీ చాలా అవ‌స‌రం. అది కేంద్రం దాకా తెలియ‌డం కూడా చాలా అవ‌స‌రం. కానీ.. ఈ క‌రోనా టైంలో..అంతా మాయం అయింది. ఈ మ‌ధ్య అస‌లు మ‌నం విశాఖ ఉక్కు ఉద్య‌మం గురించి తెలుసుకోవ‌డం కూడా లేదు.

ఈ పార్టీల ఎవ్వారం తెలిసిందే క‌దా. ఎన్నిక‌ల టైంలో అయితే.. మా గొప్ప‌లు చెప్పుకుంటారు.  విజ‌య‌సాయి లాంటి వారి ఎవ్వారం గురించి.. వైసీపీ లీడ‌ర్ల గురించి అయితే ఇక చెప్పాల్సిన ప‌న్లేదు. అబ్బో.. ఆ గొప్ప‌లు.. డ‌ప్పులు వేరే క‌దా. అయితే.. ఉద్య‌మ క‌మిటీ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. పార్క్ హోట‌ల్ నుంచి.. ఆర్కే బీచ్ వర‌కు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అయితే.. ఈ ర్యాలీలో ఢిల్లీ రైతు ఉద్య‌మ నేత రాకేశ్ టికాయ‌త్ పాల్గొన్నారు.  దీంతో ఉద్య‌మానికి ఊపొచ్చింది. ర్యాలీకి ఫేమ్ వ‌చ్చింది. మ‌ళ్లీ విశాఖ  ఉక్కు ఉద్యమం వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఆల్రెడీ రైతు ఉద్య‌మం ఎలా న‌డుస్తుందో.. అందులో రాకేశ్ టికాయ‌త్ పార్టిసిపేష‌న్ ప‌వ‌ర్ ఏంటో తెలిసిందే క‌దా. ఆయ‌న స్వ‌యంగా ఈ ర్యాలీలో పాల్గొన‌డంతో నేష‌న‌ల్ వైడ్ గా హైలైట్ అయింది. ఇక తెలంగాణ నుంచి మేమొస్తం మేమొస్తం అంటూ మీన మేషాలు లెక్కిస్తోన్న  టీఆర్ఎస్ లీడ‌ర్లు కూడా రావాల‌ని.. కేసీఆర్ కేటీఆర్ లు కూడా విశాఖ ఉక్కు కోసం పోరాడాల‌ని.. ఇప్పుడు కానీ.. ఎంట్రీ ఇస్తే.. ఉద్య‌మం ఉవ్వెత్తున పైకి లేస్తుంది అంటున్నారు ఉక్కు ఉద్య‌మ కారులు.

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   2 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   13 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle