తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది
19-01-202119-01-2021 23:04:24 IST
2021-01-19T17:34:24.037Z19-01-2021 2021-01-19T17:34:08.117Z - - 07-03-2021

ఇటీవలి కాలంలో తిరుమలలో ఏవేవో ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. తిరుమల ఆలయం వద్ద పందులు స్వైరవిహారం చేసిన ఘటన మరవకముందే.. తిరుమల అలిపిరి నడకదారిలో భక్తుల్ని దొంగలు వెంబడించడం కలకలం రేపింది. శ్రీవారిని దర్శించుకునేందుకు నడక మార్గంలో వెళ్లుతండగా తమ వద్ద ఉన్న బంగారాన్ని దోచుకోవడానికి దుండగులు యత్నించారని కర్నూలుకు చెందిన భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నడక మార్గంలో 2,830వ మెట్టు దగ్గర ఘటన జరిగినట్లు చెబుతున్నారు. దొంగల నుంచి తప్పించుకోడానికి పరుగులు పెట్టామని.. ఆదివారం రాత్రి 11 గంటలకు డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి భక్తులను కాపాడారు. నడక మార్గంలో దొంగలు కనిపించడంతో భక్తులు భయపడుతున్నారు.
పవిత్రమైన శ్రీవారి ఆలయం ఎదురుగా పందుల మంద స్వేచ్ఛగా తిరుగుతూ ఉండడం చూసి భక్తులు షాక్ కు గురయ్యారు. పదికి పైగా పందులు శ్రీవారి ఆలయం ముందుభాగంలో చాలాసేపటి వరకు అటూ.. ఇటూ.. తిరుగుతూ కనిపించాయి. వాటిని అదిలించే వారు లేకపోవడం.. టీటీడీ సిబ్బంది కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడంతో భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు మండిపడుతున్నారు. ఆధ్యాత్మిక వాతావరణానికి, శుభ్రతకు మారుపేరుగా నిలిచే తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో ఇలాంటి ఘటనలు పదే పదే చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పందులు సంచారానికి రాకుండా శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆదివారం తెల్లవారు జామున 2 నుంచి 3 గంటల మధ్యలో పందుల మంద తిరుమాడ వీధుల్లో కలియ తిరిగాయి. సాధారణంగా పందులు కాటేజీల పరిసరాల్లో కనిపిస్తుంటాయి. ఆహారం కోసం అవి దుకాణాలు, కాటేజీల వద్ద తిరుగాడుతుంటాయి. శ్రీవారి ఆలయ పరిసరాల్లోకి రాకుండా అక్కడి భధ్రతా సిబ్బంది కాపలాగా ఉంటారు. కానీ ఆదివారం తెల్లవారు జామున పదికి పైగా పందుల గంపు తిరుమాడ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించడం వివాదాస్పదమైంది. అధికారులు ఇలాంటి ఘటనలపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

బలంగా ప్రతి పక్షాలు.. వైసీపీకి రాహుకాలం తప్పదా
37 minutes ago

అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి
8 hours ago

మరో ఇష్యూలో మేయర్ విజయలక్ష్మి
9 hours ago

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి
16 hours ago

మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!
15 hours ago

ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు
17 hours ago

కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
17 hours ago

కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!
19 hours ago

తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం
a day ago

బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం
a day ago
ఇంకా