newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

14-05-202114-05-2021 15:26:25 IST
2021-05-14T09:56:25.085Z14-05-2021 2021-05-14T09:56:21.347Z - - 14-06-2021

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి: ఆంద్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులు మళ్ళీ అంబులెన్స్ సైరన్లతో కోవిడ్ రోగుల నిట్టూర్పులతో ఘోషిస్తున్నాయి. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లలో హైదరాబాద్ వస్తున్న కోవిడ్రో గులను పోలీసులు ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. మానవతా దృక్పధంతో ఈ అంశాన్ని పరిష్కరించు కోవాలని హైకోర్టు సూచించినప్పటికీ మళ్ళి వ్యవహారం మొదటికి వచ్చింది. శుక్రవారం కూడా కృష్ణా జిల్లా సమీపంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వాహనాలను తెలంగాణ సరిహద్దులో పోలీసులు ఆపేశారు. రెండు రోజుల క్రితం ఆంద్ర ప్రదేశ్ నుంచి అంబులెన్స్లు కోవిడ్ రోగుల రాకపై ఆంక్షలు విధించారు. ఇందుకు కారణం ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు లేకపోవడమే. మామూలుగా అయితే ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అంబులెన్స్లను ఎవరూ ఎక్కడా ఆపడానికి వీలులేదు. కానీ రోగిని అంబులెన్స్ లో తీసుకువస్తున్నారంటేనే అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అర్ధం. అయినా కూడా కోవిడ్  పాసులు లేని కారణంగా రోగులతో పాటు ఈ అంబులెన్స్ లను వెనక్కి వెళ్లిపోవలసిందిగా పోలీసులు ఆదేశిస్తున్నారు. చేసేదేమి లేక దిక్కుతోచని స్థితిలో రోగుల బంధువులు అంబులెన్స్ లలోనే ఎదురు చూస్తున్నారు. ఎక్కడి అంబులెన్స్ లు అక్కడ ఆగిపోవడం వల్ల పరిస్థితి విషమించి తమ ఆక్సిజన్ అయిపోయి పలువురు రోగులు మరణించనట్లుగా కూడా కథనాలు వస్తున్నాయి.

ఈ మరణాలు బాధ్యులెవరన్న డిమాండ్లు కూడా తీవ్రమవుతున్నాయి. పోలీసులు మాత్రం ఈ నియమ నిబంధనల అమలు విషయంలో అధికారుల ఆదేశాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని చెబుతున్నారు. అయితే తెలంగాణాలో ఉన్న ఆసుపత్రుల అనుమతి, పడకల లభ్యతకు సంబంధించి తగిన అనుమతులు ఉంటేనే అంబులెన్స్ లను ఆంధ్రప్రదేశ్ నుంచి అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. కానీ తాజాగా వచ్చిన అంబులెన్స్ లకు తగిన పాసులు లేని కారణంగా జగ్గయ్యపేట వద్ద వీటిని ఆపేసిన పోలీసులు వెనక్కి పంపేశారు. అయితే సాధారణ ప్రయాణీకులను అనుమతించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తీసుకు వస్తున్న అంబులెన్స్ లను వెనక్కి పంపడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక జగ్గయ్యపేట సరిహద్దు వద్దనే కాక  కర్నూల్  తెలంగాణ సరిహద్దు వద్ద కూడా ఇదే రకమైన  పరిస్థితి  నెలకొంది. అంబులెన్స్ లను సరిహద్దుల్లో ఆపడం పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ శుక్రవారం కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొనడంతో రోగుల బంధువులు తీవ్ర మనస్తాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని షరతులతోనే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారిని తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తోందని  తెలంగాణకు వెళ్లాలనుకునే వ్యక్తులు ముందుగానే అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle