నిమ్మల, అచ్చెన్న వీళ్ళే ఈసారి కూడా టీడీపీ గతి!
01-12-202001-12-2020 15:22:42 IST
Updated On 01-12-2020 15:21:57 ISTUpdated On 01-12-20202020-12-01T09:52:42.434Z01-12-2020 2020-12-01T09:10:32.795Z - 2020-12-01T09:51:57.888Z - 01-12-2020

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం వైసీపీ హవానే నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి కనీసం సంఖ్యా బలం లేకుండా ఉండడంతో మాట్లాడడానికి కూడా బలమైన నాయకులు లేకుండా పోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం తన వాయిస్ తో అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టగలడు చెప్పండి.. అందుకే బలమైన వాయిస్ వినిపించే నేత వైపు టీడీపీ అభిమానులు కూడా చూస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చంద్రబాబు అనేక అంశాల విషయంలో ప్రిపేర్ అయ్యి వచ్చినప్పటికీ.. అన్నిటినీ ఆయనే మాట్లాడాలంటే కష్టమైన పనే..! అసెంబ్లీలో టీడీపీ పార్టీ తరఫున గళం వినిపించేవారే కనిపించకపోవడం పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. 18 మంది మాత్రమే కనిపిస్తున్నారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ వైసీపీకి మద్దతుదారులుగా మారారు. అంటే.. 19 మంది టీడీపీలో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు ఎప్పుడు వైసీపీ కండువా కప్పుకుంటారా అని తెలియని పరిస్థితి. 18 మందితో బండి లాంగించాల్సి వస్తుంది. ఇక హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సభకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులు మాత్రమే. తొలి రోజు ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలు సస్పెండ్ అయినా తర్వాత అయినా మిగిలిన వారెవ్వరు అసెంబ్లీలో బలంగా గళం వినిపించే పరిస్థితులు లేవు. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ నిమ్మల, అచ్చెన్నే ఎట్రాక్షన్‌గా వ్యవహరించారు. చంద్రబాబు తర్వాత పార్టీ వాయిస్‌ను సభలో గట్టిగా వినిపించారు. ఈసారి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలకు పదేపదే ఆటంకాలు కల్పిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. పదే పదే వాగ్వాదానికి దిగుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.

పంచాయితీ కోసం టీడీపీ పంచసూత్రాలు
40 minutes ago

రామ తీర్థానికి కొత్త కళ
an hour ago

బరిలోకి దిగిన జనసేన.. పవన్ వర్సెస్ జగన్ ఫైట్
an hour ago

ఏకగ్రీవాల్లోనూ.. ఎవరి దారి వారిదేనా..
2 hours ago

కర్నాటకలోని మరాఠీ ప్రాంతాలు మావే.. ఉద్ధవ్ వ్యాఖ్యతో వివాదం
4 hours ago

జాతీయ జెండాను అవమానిస్తే సహించం.. కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణ
7 hours ago

ఏకగ్రీవాలపై పేపర్ ప్రకటన.. ఎవరిని అడిగి ఇచ్చారని సంజాయషి ఇవ్వాల్సిందే..
7 hours ago

రైతుల ఉద్యమంలో విధ్వంసకారులు.. 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
8 hours ago

వైసీపీలో గ్రూపుల కొట్లాట.. ఏకగ్రీవం కోసం ఫైటింగ్ లు
6 hours ago

ఏకగ్రీవం తొలి బోణీ కొట్టిన వైసీపీ..
9 hours ago
ఇంకా