పంచాయితీ కోసం టీడీపీ పంచసూత్రాలు
28-01-202128-01-2021 16:18:32 IST
Updated On 28-01-2021 16:27:49 ISTUpdated On 28-01-20212021-01-28T10:48:32.458Z28-01-2021 2021-01-28T10:48:19.070Z - 2021-01-28T10:57:49.943Z - 28-01-2021

ఏది ఏమైనా సరే. జగన్ పై పై చేయి సాధించాలి. జనంలో సీఎం జగన్ పై ఎంత వ్యతిరేకత ఉందో చూపించాలి. దానికి ఈ పంచాయితీ ఎన్నికలే మంచి అవకాశం అంటూ.. ఏపీలో ప్రతి పక్ష పార్టీలు అన్నీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. జగన్ మొండి వైఖరిపై జనంలో ఎలాంటి ఇంటెన్షన్ లో ఉన్నారు.. జనంలో వైసీపీ ప్రభుత్వం పై ఎంత వ్యతిరేకత ఉంది తెలియాలంటే.. పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి దెబ్బ పడాల్సిందే. ఓటరు దెబ్బ ఏంటో జనం చూపిస్తే కానీ.. ఏపీలో వైసీపీ సర్కార్ కాస్త కంట్రోల్ కాదు. ఇదే ఇంటెన్షన్ తో ఉన్నారు లీడర్లు. ఇక టీడీపీ మాత్రం సీరియస్ గానే ఫోకస్ చేసింది. ప్రధాన ప్రతి పక్షం పవరేంటో చూపించాలని పట్టుదలతో ఉంది టీడీపీ. వైసీపీ సర్కార్ కి టీడీపీ పవర్ చూపించి.. ఈసారి వచ్చే జనరల్ ఎలక్షన్ లోగా.. టీడీపీ ఏ పొజిషన్ లో ఉంటుందో.. జనంలో తమ పార్టీకి ఎంత మద్దతు ఉందో తెలియజేయాలి అని చూస్తోంది టీడీపీ. అందుకే.. పంచాయితీ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ముందు నుంచే ఉన్న ప్లాన్ ప్రకారం మూవ్ అవుతోంది టీడీపీ. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో.. ఎదుర్కోవడం కష్టమే అనే విషయం పై క్లారిటీ ఉన్నా.. జనంలో ఉన్న వైసీపీ వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత తమ పార్టీకి కలిసి వస్తుంది అనేది టీడీపీ నమ్మకం. దానికి తగ్గట్లే పంచాయితీ ఎన్నికలకి ప్రిపేర్ అయింది టీడీపీ. ఈ ఎన్నికల కోసం పంచ సూత్రాల ప్లాన్ ని తెరపైకి తెచ్చారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అలా అని నేల విడిచి సాము చేయకుండా చాలా నీట్ గా వెళ్తోంది టీడీపీ. పక్కా ప్లానింగ్ ప్రకారం ప్రభుత్వంలో ఉన్న వైసీపీకి చెక్ పెట్టాలని ప్రిపేర్ అయింది. మెయిన్ గా.. నీటి విషయంలో క్లారిటీగా ఉంది టీడీపీ. ఏపీలో ఇప్పుడు కలుషిత నీటి సమస్య ఫుల్ గా ఉంది. మొన్న వెస్ట్ గోదావరి ఇష్యూ తెలిసిందే కదా. జనాలంతా హాస్పిటల్ లో పడిపోయారు. ఆ టైంలో.. నీటి సమస్య తెరపైకి వచ్చింది. అందుకే.. సురక్షితమైన తాగునీటికి భరోసా ఇస్తోంది టీడీపీ. నీటి కులాయిలు ఏర్పాటు చేయడం.. మంచి నీటి సరఫరా అంటూ.. జనంలోకి వెళ్తోంది. ఇక ఏపీలో టెన్షన్ వాతావరణం కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచీ ఉంది అనే విషయంపై టీడీపీ గట్టిగానే వాదిస్తోంది. అందుకే.. తామైతే.. భ్రదత విషయంలో అందరికీ భరోసా ఇస్తాం అంటోంది. గ్రామాల్లో గొడవలు లేకుండా.. నేర రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతాం అంటోంది టీడీపీ. పల్లెల్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం.. ఏ మాత్రం పట్టించుకోక పోవడం శుభ్రత విషయంలో ఏ లీడరూ ఫోకస్ చేయకపోవడం మామూలే. అందుకే.. పరిశుభ్రతకు భరోసా ఇస్తోంది టీడీపీ. నాలుగో సూత్రంగా స్వయం సమృద్ది అంటోంది టీడీపీ. మోటార్లకు మీటర్ల బిగింపుని వ్యతిరేకిస్తోంది కదా టీడీపీ. ఈ విషయంపై తమ ఫస్ట్ ఫోకస్ అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అలాగే.. గ్రామాల్లో స్వయం సంవృద్ధి సాధించే దిశగా సపోర్ట్ చేస్తాం అంటున్నారు లీడర్లు. ఆస్తిపన్ను, పౌరసరఫరాలను ఐదో సూత్రంగా చేర్చింది టీడీపీ. గ్రామాల్లో పన్ను బకాయిలపై రాయితీలు ఇవ్వడంతో పాటు.. పేదలపై భారంగా ఉన్న ఆదాయపు పన్నులో.. 50 శాతం తగ్గిస్తాం అంటోంది టీడీపీ. పంచ సూత్రాలతో ముందుకెళ్తూ.. పంచాయితీ ఎన్నికల్లో జెండా ఎగరేయాలనేది టీడీపీ ప్లాన్.

హారిక రేంజ్ పెరిగిందా..టూరిజం శాఖ రేంజ్ అంతేనా
a minute ago

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
3 hours ago

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భార్య ఒత్తిడే కారణమా
3 hours ago

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ సర్కార్ కు ముందే తెలుసు
5 hours ago

వివాదంలో అశోక్‌గజపతిరాజు.. మహిళను కొట్టారా..?
an hour ago

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
20 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
a day ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
a day ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
a day ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
a day ago
ఇంకా