పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే
02-12-202002-12-2020 17:14:14 IST
Updated On 03-12-2020 08:02:31 ISTUpdated On 03-12-20202020-12-02T11:44:14.574Z02-12-2020 2020-12-02T11:44:10.424Z - 2020-12-03T02:32:31.771Z - 03-12-2020

అసెంబ్లీ సమావేశాల్లో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. మూడో రోజు సమావేశాల్లో టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ రోజు శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని అధికారపక్ష ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్ద టీడీపీ శాసనసభ్యులు ఆందోళన చేపడుతున్నారంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సభకు ఆటంకం కలిగిస్తున్న 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 9 మంది ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెన్షన్ కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, డోల బాలవీరాంజనేయ స్వామి, బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు ఉన్నారు. మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సాగుతూ ఉన్నాయి. ఈ మూడు రోజులూ అసెంబ్లీలో ఎన్నో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడు స్పీకర్ పోడియం వద్ద కూర్చోవడం కూడా సంచలమైంది. ఇక అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి బలం లేకపోవడంతో వాయిస్ రైజ్ చేయడానికి కూడా సభ్యులు లేరు. ఉన్న నాయకులతోనే ప్రశ్నల వర్షం కురిపించి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్రయత్నాలు చేయాలని టీడీపీ ప్రయత్నిస్తూ ఉన్నా.. సస్పెన్షన్ వేటు పడుతూ ఉండడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి టీడీపీ బృందంలో ఉంది.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!
14 minutes ago

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం
an hour ago

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?
2 hours ago

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
7 hours ago

వరస్ట్ సీఎంలలో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే
8 hours ago

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా
9 hours ago

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?
10 hours ago

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్
11 hours ago

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?
12 hours ago

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?
12 hours ago
ఇంకా