newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

13-04-202113-04-2021 16:53:56 IST
Updated On 14-04-2021 12:02:31 ISTUpdated On 14-04-20212021-04-13T11:23:56.139Z13-04-2021 2021-04-13T11:23:52.715Z - 2021-04-14T06:32:31.713Z - 14-04-2021

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో వున్న చంద్రబాబుపై దుండగులు రాళ్ళ దాడికి యత్నించారు. దీంతో రోడ్ షో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రోడ్ షోలో ప్రసంగిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆపై ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. తన రోడ్ షోలో జరిగిన రాళ్ల దాడిని చంద్రబాబు ఎస్పీకి వివరించారు.

టీడీపీ సభపై జరిగిన రాళ్ల దాడి రాజకీయ కుట్ర అని ఆరోపించారు. టీడీపీ నేతలపై ప్రణాళిక ప్రకారం దాడి చేశారని వెల్లడించారు. టీడీపీని లేకుండా చేయాలని వైసీపీ దుష్ట పన్నాగాలకు పాల్పడుతోందని విమర్శించారు. రాళ్ల దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరిస్తారని తెలిపారు. 

అనుకున్నట్లుగానే తిరుపతి రాళ్ల దాడి అంశాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శిలను కలవాలని టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ నిర్ణయించుకున్నారు. సాయంత్రం 4.15 గంటలకు సీఈసీతో భేటీ కానున్న టీడీపీ ఎంపీలు, సాయంత్రం 6 గంటలకు కేంద్రం హోంశాఖ కార్యదర్శితో సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగిందన్న విషయంపై ఫిర్యాదు చేయనున్నారు. కేంద్ర బలగాలతో తిరుపతి ఉప ఎన్నిక నిర్వహించాలని కోరనున్నారు. చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో డీజీపీ విఫలం అయ్యాడని, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రోద్బలంతోనే చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడి జరిగిందని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా నాయకులపై ఎన్ని దాడులు చేసినా తిరుపతిలో వైసీపీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. వైసీపీ అవలంబిస్తున్న రాజారెడ్డి రాజ్యాంగానికి రాళ్లదాడే ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు.

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   26 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   an hour ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   an hour ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle