newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

15-05-202115-05-2021 07:44:46 IST
2021-05-15T02:14:46.790Z15-05-2021 2021-05-15T02:14:41.488Z - - 14-06-2021

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రఘురామకృష్ణరాజు అరెస్టుపై పలువురు టీడీపీ నేతలు స్పందించారు. రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఈ  అరెస్ట్ జగన్ సైకో మనస్తత్వానికి నిదర్శనం అని విమర్శించారు. జగన్ అసమర్థతను ఎత్తిచూపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రజల ప్రాణ రక్షణ గురించి పట్టించుకోకుండా, కక్ష తీర్చుకునేందుకు యంత్రాంగాన్ని వాడుకుంటున్న ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ తప్ప దేశంలో మరెవ్వరూ లేరని అన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా వ్యాఖ్యలు చేశారని రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారని.. జగన్ సర్కారుపై విశ్వాసం లేదని 5 కోట్ల ఆంధ్రులూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారని, మరి వారందరినీ కూడా అరెస్ట్ చేస్తారా? అని లోకేశ్ ప్రశ్నించారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించినా లెక్కచేయకుండా అరెస్ట్ చేశారని..  వై కేటగిరీ భద్రతలో ఉంటూ, ఇటీవలే బైపాస్ చికిత్స పొందిన సొంత పార్టీ ఎంపీని ఆయన పుట్టినరోజు నాడే అరెస్ట్ చేయించడం జగన్ ఉన్మాదాన్ని వెల్లడిస్తోందని తెలిపారు. ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (సీఐడీ) ఇప్పుడు సీఎం ఇండివిడ్యువల్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని నారా లోకేష్ అన్నారు. 

టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రఘురామకృష్ణరాజు అరెస్టును ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని.. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు జగన్, ఇతర వైసీపీ నేతలు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు తాము ఎన్నిసార్లు సీఐడీ అరెస్టులు చేయాలని వెలగపూడి ప్రశ్నించారు. 

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ప్రాణాలు పోతున్న రోగులను తెలంగాణ సరిహద్దుల వద్ద ఆపుతున్నారు కానీ, ఏపీ సీఐడీ పోలీసులను మాత్రం ఆపడంలేదు ఆ రహస్యం ఏమిటో? అని సందేహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకమైన వారి అరెస్టులన్నీ శుక్రవారమే జరుగుతాయి. కూల్చివేతల ముహూర్తం శనివారం తెల్లవారుజామునే ఉంటుంది. కోర్టులకు శని, ఆదివారాలు సెలవు కాబట్టి బెయిళ్లు, స్టేలు రాకుండా ఉండేందుకు ఆ రోజులను ఎంచుకుంటున్నారని అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తిని అరెస్ట్ చేయించడం బెయిల్ నిబంధనల ఉల్లంఘన కిందకు రాదా? అని అయ్యన్న ప్రశ్నించారు. 

జగన్ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రఘురామకృష్ణరాజు లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేకనే అక్రమ అరెస్టు చేశారని.. 'రూల్ ఆఫ్ లా'ను నిర్వీర్యం చేస్తూ అడ్డగోలుగా అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారని అన్నారు. వారెంట్ లేకుండా రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయడం అక్రమం అని.. తన ప్రత్యర్థులపై జగన్ చేస్తున్న దమనకాండకు ఇదొక నిదర్శనం అని తెలిపారు.

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle