సంబరాలు చేసుకున్న టీడీపీ వర్గాలు
22-02-202122-02-2021 12:24:26 IST
Updated On 22-02-2021 10:08:18 ISTUpdated On 22-02-20212021-02-22T06:54:26.383Z22-02-2021 2021-02-22T03:46:26.621Z - 2021-02-22T04:38:18.572Z - 22-02-2021

పంచాయతీ ఎన్నికల తుది అంకం ముగిసింది. తాము బలపర్చిన అభ్యర్థులకే సర్పంచ్ పదవులు వచ్చాయని వైసీపీ చెబుతూ ఉంది. అయితే అనూహ్యంగా టీడీపీ ఆఫీసుల్లో సంబరాలు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల విజయంతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాత్రి 11 గంటల సమయానికి 848 పంచాయతీల్లో తమ మద్దతుదారులు గెలుపొందారని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 1,202 చోట్ల విజయం సాధించినట్టు చెప్పారు. వైసీపీ అరాచక పాలన అంతానికి ఈ ఎన్నికల ఫలితాలు ఉదాహరణ అని, జగన్ పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు నాంది పలికారని అన్నారు. సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ వైసీపీ నేతలు రాత్రివేళ ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తారని ఆరోపించారు. చీకటి పడ్డాక ఎన్నికల ఫలితాల సరళిలో మార్పులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. డీజీపీ ఇదేమీ పట్టించుకోకుండా విజయనగరంలో తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి దశలోనూ టీడీపీ బలపరిచిన అభ్యర్థుల విజయాల శాతంపెరుగుతూ వచ్చిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. మొదటి దశలో 38.7 శాతం గెలిస్తే, రెండో దశలో 39.5 శాతం, మూడో దశలో 41.4 శాతం, నాలుగో దశలో 50 శాతం పంచాయతీల్లో తమ మద్దతుదారులు విజయం సాధించారని అన్నారు. నాలుగో విడత పోలింగ్ ముగియగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ పోటాపోటీగా గత రాత్రి సంబరాలను చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయం వద్ద వైసీపీ, మంగళగిరి పార్టీ ఆఫీసు వద్ద టీడీపీలో సందడి నెలకొంది. భారీ ఎత్తున బాణసంచా పేల్చి వేడుకలు జరుపుకున్నారు. వైసీపీ ఆఫీసు వద్ద కళాకారులు సాంస్కృతిక నృత్యరూపకాలతో ఆకట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమకు మెరుగైన స్థానాలు వచ్చాయంటూ ఇరుపార్టీల కార్యకర్తలు చెప్పుకొంటూ ఉన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రేగుబిల్లి గ్రామ పంచాయతీలో వైసీపీ, టీడీపీల మద్దతుతో ఇద్దరు అభ్యర్థులు పోటీ చేశారు. ఆదివారం పోలింగ్ అనంతరం జరిగిన లెక్కింపులో ఒక్క ఓటు తేడాతో వైసీపీ మద్దతుదారు కె.వెంకటకృష్ణమూర్తి గెలుపొందారు. టీడీపీ మద్దతుదారుల డిమాండ్ మేరకు రీకౌంటింగ్ జరిపినా.. మళ్లీ అదే ఫలితం వచ్చినట్లు తెలుస్తోంది.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
7 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
9 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
10 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
10 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
10 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
11 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
11 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
an hour ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
9 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
12 hours ago
ఇంకా