రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
08-03-202108-03-2021 13:42:59 IST
Updated On 08-03-2021 14:07:28 ISTUpdated On 08-03-20212021-03-08T08:12:59.979Z08-03-2021 2021-03-08T08:12:35.896Z - 2021-03-08T08:37:28.479Z - 08-03-2021

విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) పెద్ద కుమారుడు రాంజీ గత అర్ధ రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 37 సంవత్సరాలు. బ్రెయిన్ డెడ్‌తో ఆసుపత్రిలో చేరినట్టు చెబుతున్న ఆయనకు మూడు రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాంజీ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండే రాంజీ, పార్టీ వ్యవహరాల్లో తండ్రికి సాయంగా ఉండేవారు. రాంజీ మృతి విషయం తెలిసి టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. రాంజీ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. 'మాగంటి రాంజీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొంటూ ఉంటే.. ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉంటుందనుకున్నాం. అలాంటిది చాలా చిన్న వయసులో ఇలా అర్థాంతరంగా అందరికీ దూరమైపోవడం బాధాకరం. పార్టీకి తీరని లోటు' అని చంద్రబాబు చెప్పారు. 'పుత్రశోకం నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని మాగంటి వెంకటేశ్వరరావుగారికి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను' అని చంద్రబాబు ట్వీట్ చేశారు. రాంజీ మృతి బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాంజీ మృతి జీర్ణించుకోలేని విషయమని అచ్చెన్నాయుడు అన్నారు. రాంజీ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతాపం తెలిపారు. ‘‘లోకేష్ అన్నా అంటూ పిలిచే ఆ పిలుపు ఇక వినపడదు. మాగంటి రాంజీ మనకి దూరం అయిపోయాడు. తెలుగుదేశానికి అండగా ఉంటానంటూ జెండా పట్టిన పసుపు సైనికుడా నీ మరణం పార్టీకీ, నాకూ తీరని లోటు. కన్నీటి నివాళి అర్పిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ నివాళి అర్పించారు. మాగంటి రాంజీ మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి రాంజీ మృతి టీడీపీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్నారు. గొప్ప స్నేహితుడిని, ఆత్మీయుడిని కోల్పోయానని బీద రవింద్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ, టీడీపీ కీలక నేత నేడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు వెళ్లి మాగంటి రాంజీ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు దురదృష్టకరమైన రోజని అన్నారు. చాలా మంచి మనిషిని కోల్పోవడం బాధాకరమన్నారు. మాగంటి బాబు కుటుంబం ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
12 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా