ఓటమిని జీర్ణించుకోలేకపోయిన టీడీపీ అభ్యర్థి
16-02-202116-02-2021 15:12:13 IST
Updated On 16-02-2021 16:31:53 ISTUpdated On 16-02-20212021-02-16T09:42:13.473Z16-02-2021 2021-02-16T09:42:10.719Z - 2021-02-16T11:01:53.066Z - 16-02-2021

రాజకీయాల్లో గెలుపోటములు సహజమే.. వాటిని మరీ పర్సనల్ గా తీసుకోకూడదని అంటూ ఉంటారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికలు ముగియగా.. రేపు మూడోవిడత జరుగనున్నాయి. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించారు. టీడీపీకి పట్టున్న అనంతపురం జిల్లాలో కూడా మెజారిటీ పంచాయతీలు వైసీపీ సొంతం అయ్యాయి. ఎన్నికల్లో ఓటమిపాలైన అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లాలోని శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించాడు. ఓటమిని జీర్ణించుకోలేక పోయిన టీడీపీ అభ్యర్థి ఈడిగ నాగేంద్రప్ప ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇక పంచాయతీ ఎన్నికల్లో ఇలా గెలిచి.. అలా పార్టీ మారిపోతూ ఉన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రెండో విడతలో భాగంగా శనివారం ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు. సంగం మండలం చెర్లోవంగుల్లలో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ పి.రఘురామయ్య అనుచరుడు కె.రామయ్య సర్పంచ్‌గా విజయం సాధించారు. అనంతరం మాజీ సర్పంచ్‌తో కలిసి మంత్రి గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇద్దరూ వైసీపీలో చేరారు. ఏఎస్‌పేట మండలం పెద్దబ్బీపురానికి చెందిన ఎ.మాధవరెడ్డి టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. ఆదివారం ఆయన మంత్రి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే మండలంలోని చౌటభీమవరం సర్పంచ్‌గా టీడీపీ మద్దతుతో విజయం సాధించిన లక్ష్మీనారాయణ కూడా వైసీపీలో చేరిపోయారు.
నామినేషన్లు వెనక్కి తీసుకోవాలంటూ టీడీపీ మద్దతుదారులను పోలీసులే బెదిరిస్తుండడం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు బెదిరింపులకు దిగడం బాధాకరమని అన్నారు. జగన్ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుంటే, కొందరు పోలీసులు బానిసలుగా మారి చట్టాన్ని అతిక్రమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు మనోధైర్యం వీడరాదని, వైసీపీ అరాచక పాలనను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
21 minutes ago

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
2 hours ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
2 hours ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
3 hours ago

ఆహా.. ఇది అద్భుతమైన ఓపెనింగ్ ఎంపీ సార్
2 hours ago

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
16 hours ago

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
17 hours ago

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
21 hours ago

అధిష్టానంతో అటో ఇటో తేల్చుకుంటాం.. కాంగ్రెస్ అసమ్మతి నేతలు సిద్ధం
a day ago

జగన్ కి పాలన రాదు అనే మాటకి నిదర్శనాలు ఇవేనా
19 hours ago
ఇంకా